
అమెరికాలో ఖలిస్థాన్ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇండియానా రాష్ట్రంలోని జాన్సన్ కౌంటీలో అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్ ఆలయంపై దాడికి పాల్పడ్డారని ది హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్‌లో వెల్లడించింది. ఖలిస్థానీకి మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా ఆలయంపై పలు విద్వేషపూరిత నినాదాలు రాశారని పేర్కొంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి విధ్వంసాలను తాము ఖండిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమెరికాలో ఈ ఏడాది హిందూ దేవాలయాలపై దాడులు చేయడం ఇది నాలుగోసారని నిర్వహకులు చెబుతున్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఆలయం దగ్గర భారీ భద్రను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా గతేడాది మార్చిలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఐకానిక్ ఆలయంపై ఇలాంటి దాడే జరిగింది.
ఆ ఆలయంపై కూడా భారత్‌కు వ్యతిరేకంగా రాతలు రాశారు. దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది నీచమైన చర్యగా పేర్కొంది. 2023 సెప్టెంబర్‌లో కూడా న్యూయార్క్‌లోని మెల్‌విల్లేలో బీఏపీఎస్ ఆలయంపై భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాసుకొచ్చారు. ఈ ఘటన జరిగిన తొమ్మిది రోజులకే సాక్రమెంటో దగ్గర్లోని మరో ఆలయంపై దాడి జరిగింది. అదే డిసెంబర్‌లో కాలిఫోర్నియాలోని న్యావార్క్ బీఏపీఎస్ ఆలయంపై కూడా దాడులకు పాల్పడ్డారు.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా డ్రోన్లు కూల్చేసిన పోలాండ్