విద్యాసంస్థల వద్ద డ్రగ్స్ బానిసల కోసం ఈగల్ వేట

విద్యాసంస్థల వద్ద డ్రగ్స్ బానిసల కోసం ఈగల్ వేట

తెలంగాణాలో డ్రగ్స్ స్మగర్ల భరతం పట్టేందుకు ఇప్పటి వరకు మాదకద్రవ్యాల స్మగర్లను పట్టుకునేందుకు ఇన్ఫార్మర్ వ్యవస్థను వాడిన ఈగల్ పోలీసులు ఇప్పుడు వీరి మూలంగా విద్యా సంస్థల్లో చదువుకుంటూ బానిసలుగా మారిన విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు. వ్యసనపదుల వివరాలను పక్కాగా సేకరించి వారిని వరుసగా పట్టుకుంటూ వారు వెల్లడించే సమాచారం ఆధారంగా స్మగర్ల భరతం పడుతున్నారు.

మరోవైపు ఈగల్ దాడుల్లో పట్టుబడుతున్న వ్యసనపరుల్లో ప్రారంభ దశలో వున్న వారికి కౌన్సిలింగ్తో సరిపుచ్చుతున్న అధికారులు వీటికి కానిసలుగా మారిన వారినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ స్పెషల్ ఆపరేషన్ ను మరింత పక్కాగా అమలు చేయాలని ఈగల్ పోలీసులు నిర్ణయించారు.  మామూలుగా మాదకద్రవ్యాల స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులతో పాటు అబ్కారీ శాఖ ఇన్ఫార్మర్ వ్యవస్థతో పాటు పాత నేరగాళ్ల నుంచి అందే సమాచారం, అనుమానిత ప్రాంతాలలో ఆకస్మిక దులు నిర్వహించడం పరిపాటిగా వుండడం తెలిసిందే. దీనివల్ల కేవలం మాదకద్రవ్యాల క్రయ, విక్రేతలు మాత్రమే పట్టుబడుతున్నారు. 

అయితే ఇదే సమయంలో వీరి కారణంగా వ్యసనపరులుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీ విద్యార్థులు ఎక్కువగా వుంటున్నారు. ఒకడు అరెస్టయితే వాడితో పరిచయం వున్న మరో నేరగాడు అందుబాటులోకి వస్తుండడంతో వ్యసనపరులుగా మారిన విద్యార్థులు తమకు కావాలసిన సరుకును నిమిషాల్లో సమకూర్చు కుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలతో పాటు అనేక ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు కొనేళ్లుగా డ్రగ్స్ మాఫియా ఉచ్చులో చిక్కుకు పోయాయని ఈగల్ గుర్తించింది. గంజాయి సహా కొకైన్, హెరాయిన్, సింథటిక్ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్న వారిలో కాలేజీ విద్యార్థులే ఎక్కువగా వుంటున్నారని అనేకమార్లు తేలింది. పోలీసులతో పాటు అబ్యార్ శాఖ అధికారుల దాడుల్లో పట్టుబడిన వ్యసనరుల్లో విద్యార్థుల సంఖ్య భారీగానే ఉంటుంది.

టీనేజి విద్యార్థులు కూడా ఇందులో వుండడం గమనార్హం, కాలేజిల్లో డ్రగ్స్, సపియా తిష్టను పారదోలాలని నర్కారు కృతనిశ్చయంతో వుండడంతో ఈగల్ పోలీసులు స్పెషల్ అపరేషన్ చేబట్టారు. ఇటీవల కాలంలో ఈగల్ పోలీసులు పక్కాగా వ్యవహరించి కాలేజీలను టార్గెట్ చేసుకుని అక్కడ డ్రగ్స్ కు బానిసలుగా మారిన వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటూ వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తూనే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్న తీరు సంచలనం రేవుతోంది.

సికింద్రాబాద్ లో ఇటీవల కాలేజీ వద్ద గంజాయి వ్యసనపరులను ఈగల్ పోలీసులు చార్లెట్ చేయగా కొందరు విద్యార్థులు పట్టుబడగా, ఈ దాడుల్లో ఇద్దరు స్మగ్లర్లు కూడా దొరికిపోయారు. ఏదాదిక్రితం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ వద్ద నిర్వహించిన దారుల్లో ఏకంగా ఇద్దరు ఎంబిబిఎస్ విద్యార్థులు గంజాయి కొంటూ దొరికిపోయారు. వైద్య విద్యార్థులు గంజాయి స్మగర్ల నుంచి గంజాయి కొంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం ఇదే తొలిసారి. 

 
కాగా ఉప్మానియా మెడికల్ కాలేజిలో ఇద్దరు వైద్య విద్యార్థులు గంజాయి కొంటూ దొరికిపోయిన ఘటన కాలేజీలో రగడకు దారితీసింది. పట్టుబడ్డ ఇద్దరు తమ కాలేజీ పూర్వ విద్యార్థులని, వారికి తమ కాలేజితో సంబంధం లేదని అధికారులు చెబుతుండగా పూర్వ విద్యార్థులు కాలేజిలో గంజాయి స్మగ్లర్ల నుంచి గంజాయి కొనవచ్చా? అని పోలీసులు ప్రశ్నించారు.