
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఏ), దాని ప్రధాన సంస్థ అయిన ది మజీద్ బ్రిగేడ్ (టిఎంబి) లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించిన తర్వాత, బలూచీ ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. బలూచ్ ప్రజలు ఉగ్రవాదులు కాదని, పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాద బాధితురాలని బలూచిస్తాన్ మానవ హక్కుల పరిరక్షకుడు మీర్ యార్ బలూచ్ స్పష్టం చేశారు.
బలూచిస్తాన్ 78 సంవత్సరాల పాటు పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదం, ఆర్థిక దోపిడీ, పాకిస్తాన్ అణు పరీక్షల నుండి రేడియోధార్మిక విషప్రయోగం, విదేశీ దండయాత్ర, ఉగ్రవాద పాకిస్తాన్ “క్రూరమైన ఆక్రమణ”ను భరించిందని పేర్కొన్నారు. బలూచిస్తాన్‌లోని ప్రజలు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ అనుబంధమైన ఐఎస్-ఖురాసన్ (ఐఎస్-కె)కి బలైపోతున్నారని, దీనిని ఆ దేశ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పెంచి పోషిస్తున్న ప్రాణాంతక ప్రతినిధి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బలూచ్ రాజకీయ పార్టీలు, వారి కార్యకర్తలపై హింసకు పిలుపునిస్తూ ఐస్కె ప్రస్తుతం ఫత్వా జారీ చేసిందని మీర్ పేర్కొన్నారు. “చట్టబద్ధమైన రాజకీయ స్వరాలను అణిచివేయడానికి, ప్రజాస్వామ్య ఆకాంక్షలను అణచివేయడానికి, ఈ ప్రాంతాన్ని అస్థిరపరచడానికి పాకిస్తాన్ రాడికల్ గ్రూపులను ఎలా ఆయుధంగా ఉపయోగిస్తుందో చెప్పడానికి ఇది మరో స్పష్టమైన ఉదాహరణ” అని మీర్ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో తెలిపారు.
చరిత్ర అంతటా, బలూచ్ ప్రజలు అమెరికా పట్ల అచంచలమైన సద్భావనను ప్రదర్శించారని, సోవియట్, ఆఫ్ఘనిస్తాన్ దాడి సమయంలో, వారు అమెరికా లేదా సోవియట్లపై ఎప్పుడూ ఆయుధాలు ఎత్తలేదని మానవ హక్కుల కార్యకర్త ఈ సందర్భంగా గుర్తు చేశారు. 9/11 తర్వాత, నాటో సరఫరా లైన్లు బలూచిస్తాన్ గుండా వెళ్ళాయని, అయినప్పటికీ బలూచ్ స్వాతంత్ర్య సమరయోధులు లేదా పౌరులు అమెరికన్ సిబ్బంది లేదా కాన్వాయ్‌లపై ఒక్క దాడి కూడా చేయలేదని మీర్ పేర్కొన్నారు.
దీనికి విరుద్ధంగా, పాకిస్తాన్ సైన్యం, ఐస్ఐ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ “అమెరికాకు మరణం” అని నినాదాలు చేస్తూ “అమెరికా వ్యతిరేక ర్యాలీలు” నిర్వహించాయని ఆయన తెలిపారు. ఒక దశాబ్దం పాటు, ఒసామా బిన్ లాడెన్ అబోటాబాద్‌లో పాకిస్తాన్ సైన్యం రక్షణలో నివసించాడని కూడా మీర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
“పాకిస్తాన్ నాయకులు అమెరికా, పశ్చిమ దేశాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నకిలీ జిహాద్ నిర్వహిస్తున్నట్లు అంగీకరించారు. మిత్రదేశాలను మోసం చేస్తూ ఉగ్రవాదాన్ని పెంచుతున్నారు. అయినప్పటికీ, ఈ రాడికల్స్‌ను ‘వ్యూహాత్మక భాగస్వాములు’గా అభివర్ణిస్తున్నారు. అయితే వనరులు సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ భూమి నిజమైన యజమానులను ఉగ్రవాదులుగా దుయ్యబడుతున్నారు,” అని మీర్ అమెరికా ద్వంద్వ ప్రమాణాలను తప్పుబడుతూ విస్మయం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్‌ను “సైనిక యూనిఫాంలో ఉన్న క్రూరమైన రాజ్యం” అని పిలుస్తూ, ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ విశ్వాసానికి “బాధ్యత” అని అది పదే పదే నిరూపించుకుందని ఆయన స్పష్టం చేశారు. బలూచిస్తాన్ స్వాతంత్ర్యాన్ని గుర్తించడం వల్ల అమెరికాకు మిత్రదేశం లభిస్తుందని, అంటే, మితవాద, స్థిరమైన, ప్రజాస్వామ్య విలువలతో అనుసంధానించబడుతుందని మానవ హక్కుల కార్యకర్త పేర్కొన్నారు.
బలూచిస్తాన్ “అవినీతి” పాకిస్తాన్ సైనిక ఉన్నత వర్గం కంటే చాలా మంచిదని, దీనిని దాని స్వంత ప్రజలు కూడా తిరస్కరించారని ఆయన స్పష్టం చేశారు. వాషింగ్టన్ నిజం, న్యాయం, బలూచిస్తాన్ ప్రజలతో నిలబడాలని కోరారు. బలూచిస్తాన్ ప్రాథమిక మానవ హక్కుల కోసం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది, బలవంతపు అదృశ్యాలు, చట్టవిరుద్ధ హత్యలు, క్రమబద్ధమైన అణచివేతలతో పోరాడుతోందని తేల్చి చెప్పారు.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం, చాలా మంది బలూచ్ నాయకులు ప్రస్తుతం ఎటువంటి నేరం లేదా న్యాయమైన విచారణ లేకుండా జైలులో మగ్గుతున్నారు. బెయిల్ నిరాకరించబడ్డారు. తరచుగా కల్పిత లేదా బహిరంగ నివారణ నిర్బంధ చట్టాల కింద ఉంచారు. బలూచ్ నాయకులతో సంబంధం ఉన్న అనేక కేసులలో, కోర్టులు పదేపదే బెయిల్ నిరాకరిస్తున్నాయి. అయితే కోర్టు ఉత్తరువులు ఉన్నప్పటికీ కుటుంబాలు, న్యాయవాదులు ఖైదీలను సంప్రదించకుండా నిరోదిస్తున్నారు.
More Stories
పాక్‌లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
పీవోకేలో ఆందోళనకారులపై కాల్పులు.. 10 మంది మృతి
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా