
* 1990లో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన సరళా భట్ కేసులో ఇప్పుడు సోదాలు
కాశ్మీరీ హిందూ సరళా భట్ దారుణ హత్య జరిగిన 35 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు, రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ)తో కలిసి ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ 1990లో కాశ్మీరీ పండిట్ సరళా భట్ అపహరణ, హత్యపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఎనిమిది ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు. సోదాలు జరిపిన ప్రదేశాలలో జైలు శిక్ష అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్ఎఫ్) నాయకుడు యాసిన్ మాలిక్ నివాసం కూడా ఉంది.
నిషేధిత జెకెఎల్ఎఫ్ తో గతంలో సంబంధం కలిగి ఉన్న అనేక మంది వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అనంతనాగ్ నివాసి అయిన సరళా భట్, శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్ కె ఐ ఎం ఎస్)లో నర్సుగా పనిచేసేవారు. ఏప్రిల్ 1990లో, జెకెఎల్ఎఫ్ అనుబంధ సంస్థల బృందం ఆమెను హబ్బా ఖాటూన్ హాస్టల్ నుండి అపహరించింది.
బుల్లెట్ గాయాలతో ఆమె మృతదేహం తరువాత ఏప్రిల్ 19న శ్రీనగర్ డౌన్‌టౌన్ ప్రాంతంలో కనుగొన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, హత్యకు గురయ్యారని తేలింది. భట్‌ను దారుణంగా చంపడానికి ముందు చాలా రోజుల పాటు సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెను “పోలీస్ ఇన్‌ఫార్మర్” అని ముద్ర వేసే నోట్ ఆమె శరీరంపై కనిపించింది.
కాశ్మీరీ పండితులు లోయను విడిచిపెట్టాలని లేదా ప్రభుత్వ ఉద్యోగాలను విడిచిపెట్టాలని ఉగ్రవాదుల ఆదేశాలను ఆమె ధిక్కరించినందుకు ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డారు. నిగీన్ పోలీస్ స్టేషన్‌లో ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసినా ఆ సమయంలో జరిగిన దర్యాప్తులో “అసలు నేరస్థులను బయటకు తీసుకురాలేకపోయారు”.
భట్ ప్రభుత్వ ఉద్యోగాలను విడిచిపెట్టి లోయను విడిచిపెట్టాలని పండితులపై ఉగ్రవాద ఆదేశాలను ధిక్కరించారని, జెకెఎల్ఎఫ్ అధికారాన్ని బహిరంగంగా సవాలు చేశారని, దీని ఫలితంగా ఆమె హత్య జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె మరణం తర్వాత కూడా ఆమె కుటుంబం బెదిరింపులను ఎదుర్కొందని, స్థానికులు ఆమె దహన సంస్కారాలకు హాజరుకావద్దని హెచ్చరించారని వారు తెలిపారు.
ఈ కేసును గత సంవత్సరం ఎస్ఐఏకు బదిలీ చేశారు. ఈ సోదాల ఫలితంగా, భట్, ఆమె కుటుంబానికి న్యాయం అందించే లక్ష్యంతో “మొత్తం ఉగ్రవాద కుట్రను వెలికితీయడానికి” సహాయపడే “నేరారోపణాత్మక ఆధారాలు” లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి. 1990లలో జరిగిన “హేయమైన ఉగ్రవాద చర్యల” వెనుక ఉన్నవారిని గుర్తించి, వారిని విచారించాలనే జమ్మూ కాశ్మీర్ పరిపాలన సంకల్పాన్ని నెరవేర్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ సోదాలు జరిగాయని ఆ వర్గాలు తెలిపాయి.
భట్ హత్య వివరాలను వెల్లడిస్తూ, బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా మాట్లా ఈ సంఘటన 1990లో కాశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాల తర్వాత వారి సామూహిక వలసలకు నాంది పలికిందని పేర్కొన్నారు. “శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో యువ కాశ్మీరీ పండిట్ నర్సు సర్లా భట్, 1990 ఏప్రిల్‌లో కాశ్మీర్‌లో ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో దారుణంగా హత్యకు గురయ్యారు. సాయుధ ఉగ్రవాదులు ఆమెను ఆమెను అక్కడి నుండి అపహరించి, తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి, భయంకరమైన హింసకు గురిచేశారు” అని తెలిపారు.
“ఆమెపై సామూహిక అత్యాచారంకు పాల్పడి భయాందోళనలు కలిగించడానికి ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి పారవేశారు. ఆమె హత్య కేవలం ఒక దారుణమైన నేరం మాత్రమే కాదు, హిందూ మైనారిటీని లోయ నుండి తరిమికొట్టడానికి ఉద్దేశించిన కాశ్మీరీ పండిట్లపై లక్ష్యంగా చేసుకున్న జాతి ప్రక్షాళన ప్రచారంలో భాగం. సరళా భట్ హత్య 1990లో కాశ్మీరీ పండిట్ల సామూహిక వలసకు దారితీసిన దారుణాలను గుర్తుచేస్తుంది” అని మాల్వియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు