
పాకిస్థాన్ మరోసారి భారత్ విషయంలో తన వక్రబుద్ధిని చూపించింది. ఇస్లామాబాద్ లోని భారత దౌత్యవేత్తల పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దౌత్యవేత్తల నివాసాలకు నీరు, గ్యాస్ వార్త పత్రికలు వంటి నిత్యావసర వస్తువల సరఫరాను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. అంతేకాకుండా భారత రాయబారులపై నిఘాను కూడా పెంచినట్లుగా తెలుస్తోంది.
భారత దౌత్యవేత్తల కార్యకలాపాలను నిశితంగా గమనించడానికి అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది. మీడియా కథనాలు ప్రకారం, భారత హైకమిషన్ ప్రాంగణంలో గ్యాస్ పైప్లైన్లు ఉన్నప్పటికీ సరఫరాను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు. అంతకుముందుకు గ్యాస్ సిలిండర్ల విక్రేతలను కూడా భారత సిబ్బందికి అమ్మకూడదని ఆదేశాలు ఇచ్చారు. దీంతో భారత రాయబారులు అధిక ధరలకు ప్రత్యామ్నాయాలను వెతకాల్సి వస్తోంది.
గ్యాస్‌ను మాత్రమే కాకుండా రాయబారి కార్యాలయానికి తాగునీటి అందించే సంస్థకు సరఫరాను నిలిపివేయమని ఆదేశించారు. ఇస్లామాబాద్‌లోని వ్యాపారలకు భారత దౌత్యవేత్తలకు తాగునీటిని అమ్మవద్దని సూచించారు. దీని వల్ల వారు సురక్షితం కాని టాప్ వాటర్ సురక్షితం కానందున్న దౌత్యవేత్తల కుటుంబాలకు సమస్యను కలిగించింది. పత్రికల సరఫరాదారులకు కూడా న్యూస్ పేపర్స్ ఇవ్వకూడదని ఆదేశించారు.
దీనిపై భారత ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ, ఉన్నతాధికారులు స్పందించినట్లు కథనాలు వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా చేసిన చర్యగా భారత ఉన్నతాధికారులు అభివర్ణించిట్లుగా సమాచారం. అంతేకాకుండా దౌత్యవేత్తల పనిని, గౌరవాన్ని కాపాడే వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది పేర్కొన్నారు.
More Stories
వలసదారులకు వ్యతిరేకంగా లండన్‌లో భారీ ప్రదర్శన
ఢాకా యూనివర్సిటీలో తొలిసారి ఇస్లామిస్ట్ ల విజయం
మార్చి 5న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికలు