ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం బెంగళూరు కెఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుండి మూడు వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో బెంగళూరు-బెళగావి, మాతా వైష్ణోదేవి కాత్రా- అమృతసర్ , నాగ్పూర్-పుణే వందే భారత్ రైళ్లు ఉన్నాయి. తరువాత, ఎలక్ట్రానిక్ నగరాన్ని బొమ్మనహళ్లితో అనుసంధానించే ఎల్లో లైన్ మెట్రో సేవను ప్రధానమంత్రి ప్రారంభించారు. భారతదేశ హై-స్పీడ్ రైలు నెట్వర్క్ను 150 రైళ్లకు చిందని తెలిపారు. ప్రపంచంలో భారత్ మూడో అతి పెద్ద మెట్రో నెట్వర్క్ కలిగి ఉందని తెలిపారు.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ను ప్రారంభించి, రెండు కారిడార్లతో కూడిన నమ్మ మెట్రో ఫేజ్-3కి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఇది రూ.15,610 కోట్ల ప్రాజెక్టు, ఇది 44 కి.మీ. ఎలివేటెడ్ ట్రాక్లు, 31 కొత్త స్టేషన్లను జోడిస్తుంది.బెంగళూరు- బెళగావి వందేభారత్ రైలులో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు.
ఆర్వీ రోడ్ మెట్రో స్టేషన్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మోదీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఆయన చేతిని పట్టుకుని ముచ్చటించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ప్రాజెక్టు వివరాలను ప్రధానికి ఉత్సాహంగా వివరించారు. ఆపై మోదీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు కలిసి మెట్రోలో ప్రయాణించారు. ఆర్ వి రోడ్ స్టేషన్ నుంచి బొమ్మనహళ్లి వరకు సాగిన 19.15 కిలోమీటర్ల ప్రయాణంలో ముగ్గురు నేతలు సరదాగా సంభాషిస్తూ పయనించారు. మోదీకి ఇరువైపులా సీఎంలు కూర్చొని పలు విషయాల్లో చర్చించడంతో అనూహ్యమైన సన్నివేశం నమోదైంది.
ఈ స్నేహపూరిత దృశ్యాలు ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఒకే వేదికపై ముగ్గురు నేతలు కలిసిపోవడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. మెట్రో ప్రారంభానికి ముందు మోదీ స్వయంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేయడం విశేషం. అనంతరం పచ్చ జెండా ఊపి ఎల్లో లైన్ సేవలను ప్రారంభించారు. ఈ మార్గం బెంగళూరు సెంట్రల్ ప్రాంతాన్ని టెక్ హబ్ అయిన ఎలక్ట్రానిక్స్ సిటీతో అనుసంధానిస్తుంది.
ఈ ప్రారంభోత్సవ రైడ్లో మోదీతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 16 మంది బాలికలు, 8 మంది చిన్నారులు, 8 మంది మెట్రో కార్మికులు కూడా పాల్గొన్నారు. వారితో ప్రధాని మోదీ మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 2014లో భారత్లో కేవలం 74 విమానాశ్రయాలే ఉన్నాయని, ఇప్పుడు 160కి చేరాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ తెలిపారు.
మౌలిక సౌకర్యాల కల్పనలో బెంగళూరు రోడ్ మోడల్గా నిలిచిందని కొనియాడారు. భారత్ వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేస్తోందని చెబుతూ ఆరోగ్యం, విద్యా రంగాల్లో కీలక మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ విజయంలో బెంగళూరు కూడా భాగస్వామి అని ప్రధాని తెలిపారు. ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ, సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగల, పాకిస్తాన్ను గంటల్లోనే వెనక్కి తగ్గేలా చేయగల భారతదేశ సామర్థ్యాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. “ఆపరేషన్ సిందూర్ విజయం మన సాంకేతికత, రక్షణలో ‘మేక్ ఇన్ ఇండియా’ శక్తి కారణంగా సాధ్యమైనది. బెంగళూరు, కర్ణాటక యువత దీనికి చాలా దోహదపడింది” అని ఆయన పేర్కొన్నారు.
More Stories
యూరియా ఎక్కువ వాడితే కాన్సర్… వాడకం తగ్గిస్తే కట్టకు రూ. 800
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత
ఆసియా కప్ 2025లో పాక్ ను మట్టికరిపించిన భారత్