రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం 2025 ఆగస్టు 14వ తేదీ నుంచి రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ స్కీమ్ అమల్లోకి రానుంది. అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ మధ్య స్వస్థలాలకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత నవంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ మధ్యలో తిరుగు ప్రయాణానికి టికెట్ తీసుకోవాలి.
ఆన్ లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే బుకింగ్ వెబ్‌సైట్‌లోని ‘కనెక్టింగ్ జర్నీ’ ఫీచర్ ద్వారా ప్రయాణికులు ఈ స్కీమ్‌ను ఉపయోగించకోవచ్చు. అయితే, వెళ్లడానికి, తిరుగు ప్రయాణానికి ఒకేసారి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికుల వివరాలు, ప్రయాణించే క్లాస్, బయలుదేరే స్థానం, గమ్యస్థానం ఒకేలా ఉండాలి. రెండు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయితే డిస్కౌంట్ వస్తుంది.
ఈ పథకం కింద రిటర్న్ టికెట్ బుకింగ్ చేసేటప్పుడు సాధారణంగా ఉండే 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ కాలపరిమితి (ఏఆర్‌పీ) వర్తించదని రైల్వే మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. 20% రాయితీ తిరుగు ప్రయాణం ప్రాథమిక ఛార్జీపై మాత్రమే ఉంటుంది. రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పథకం కింద బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఛార్జీల వాపసు కూడా ఉండదు. అలాగే, టికెట్లలో ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు. ఇక ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉన్న రైళ్లు మినహా అన్ని రైళ్లకు, అన్ని క్లాసులు, ప్రత్యేక రైళ్లకు ఈ పథకం వర్తిస్తుంది.

More Stories
షట్‌డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం
అక్టోబర్ లో రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ
రూ 700 కోట్ల అక్రమాస్తులు.. పంజాబ్ మాజీ మంత్రిపై దర్యాప్తు