ఆత్మీయతకు, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. రక్తసంబంధాన్ని, మనుషుల మధ్య మమతను గుర్తు చేసే పవిత్రమైన పండుగ రాఖీ పౌర్ణమి అని అభిప్రాయపడ్డారు. సోదర భావాన్ని పెంపొందించి, కుటుంబ వాతావరణన్ని కాపాడే పండుగ అని అభివర్ణించారు. శనివారం రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు విశ్వహిందూ పరిషత్ ,మాతృశక్తి, దుర్గా వాహిని నాయకులు రాఖీ కట్టారు. మంగళ హారతులు ఇచ్చి దీవెనలు అందించారు.
ఈ సందర్భంగా గవర్నర్ విశ్వహిందూ పరిషత్ మహిళా నాయకులకు శుభాశీస్సులు అందజేశారు. ధర్మకార్యంలో విజయం సాధించాలని దీవించారు. కులమతాలకు అతీతంగా సమస్త మానవాళికి సోదర తత్వాన్ని అందించే పండగ రాఖీ పౌర్ణమి అని గవర్నర్ చెప్పాన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగం మాతృశక్తి రాష్ట్ర కన్వీనర్ పద్మశ్రీ, కోకన్వీనర్లు శ్రీవాణి, లక్ష్మీ సరోజ, వాణి దేవి, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి, రాష్ట్ర బాల సంస్కార ప్రముఖ్ శిరీష, మహంకాళి కన్వీనర్ భవానీ, పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

More Stories
అర్బన్ నక్సల్స్ తో తెలంగాణ విద్యావిధానమా?
రామగుండంలో రానున్న ఎన్టీపీసీ ప్లాంట్ విద్యుత్ కొనాలి!
దేశవ్యాప్తంగా విస్తరించిన బలమైన పార్టీ బిజెపి