
“2025 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 114 శాతం అధికంగా దిగుమతులు నమోదయ్యాయి. అమెరికా నుంచి ముడి చమురు దిగుమతుల విలువ 1.73 బిలియన్ డాలర్ల నుంచి 3.7 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే రెట్టింపు పెరుగుదల కనిపిస్తోంది” అని ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పెరుగుదల జులై నెలలో కూడా కొనసాగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
జూన్‌తో పోలిస్తే జులైలో 23శాతం అధికంగా దిగుమతి చేసుకున్నట్లు చెప్పాయి. జూన్‌లో మొత్తం భారత ముడి చమురు దిగుమతుల్లో అమెరికా వాటా కేవలం 3 శాతం మాత్రమే ఉండగా, జూలైలో అది 8 శాతానికి పెరిగిందని. అంతేకాకుండా, 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారతీయ సంస్థలు ముడి చమురు దిగుమతులను 150 శాతం మేర పెంచనున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక 2024-2025 ఆర్థిక సంవత్సరంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ), ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతులు కూడా పెరిగాయి. ఎల్ఎన్జీ దిగుమతులు 2024-25లో 1.41 బిలియన్ డాలర్ల నుంచి 2.46 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 100శాతం పెరిగాయి. ఈ వాణిజ్య పెరుగుదల భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తోంది. కాగా ఇటీవల ప్రపంచ స్థాయిలో అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని భారత విదేశాంగ శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి