ట్రంప్ సుంకాలతో అమెరికన్లకే ఎక్కువ నష్టం

ట్రంప్ సుంకాలతో అమెరికన్లకే ఎక్కువ నష్టం
భారతదేశం ఎగుమతులపై 25 శాతం సుంకాలు విధించిన తర్వాత ఆ దేశం వెనక్కి తగ్గి తన వత్తిడులకు లొంగుతుందని అమెరికా ఆశించి ఉండవచ్చు. అయితే,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్ సరైనది అయితే,  ఆయన ప్రతిపాదించిన సుంకాలు (టారిఫ్‌లు) కేవలం ప్రపంచ దేశాలకే కాకుండా, సొంత అమెరికన్లకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. 
ఈ సుంకాల ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా అక్కడి పౌరులపై ద్రవ్యోల్బణం రూపంలో భారం పడుతుందని ఎస్‌బీఐ పేర్కొంది.
ఈ చర్య అమెరికా పౌరుల గృహ బడ్జెట్‌లను దెబ్బతీస్తుంది. డాలర్‌ను విశ్వాస సంక్షోభానికి దగ్గరగా నెట్టివేస్తుంది.  అమెరికా సుంకాల నిర్ణయాన్ని “ఒక చెడు వ్యాపార చర్య” అని ఎస్బిఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ పతనాన్ని అమెరికా తట్టుకునే దానికంటే భారత ఆర్థిక వ్యవస్థ ఈ దెబ్బను తట్టుకునే స్థితిలో ఉందని స్పష్టం చేసింది.   ఎస్‌బీఐ నివేదిక ప్రకారం, ట్రంప్ విధించనున్న సుంకాల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, కుటుంబాల వార్షిక సగటు ఖర్చు సుమారు రూ. 2 లక్షల (భారతీయ కరెన్సీలో) మేర పెరిగే అవకాశం ఉంది.
 
తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్ కుటుంబాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. “తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు అధిక ఆదాయం ఉన్నవారితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ $1,300 నష్టపోవచ్చు.  అయితే అధిక ఆదాయం ఉన్న కుటుంబాలు $5,000 వరకు నష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు. అయినప్పటికీ వారి మొత్తం ఆర్థిక స్థిరత్వంపై తక్కువ ప్రభావం ఉంటుంది” అని  ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ రచించిన పరిశోధనా పత్రం పేర్కొంది.
 
అధిక సుంకాలు దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలను పెంచి, అది అంతిమంగా అమెరికా వినియోగదారులపై భారం మోపుతుందని నివేదిక స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ట్రంప్ టారిఫ్‌ల వల్ల తలెత్తే సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని ఎస్‌బీఐ అభిప్రాయపడింది.  ఇప్పటికే స్థిరమైన ఆర్థిక విధానాలు, అంతర్గత డిమాండ్‌తో భారతదేశం మెరుగైన స్థితిలో ఉందని నివేదిక సూచించింది. 
ప్రపంచ వాణిజ్యంలో సంరక్షణాత్మక విధానాలు పెరుగుతున్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ వాటి ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఎస్‌బీఐ పేర్కొంది.  ఆ నివేదిక ప్రకారం, దాదాపు అన్ని దిగుమతులను ప్రభావితం చేసే సుంకాల కారణంగా అమెరికా వినియోగదారుల ధరలు స్వల్పకాలంలో 2.4%, దీర్ఘకాలంలో 1.2% పెరగవచ్చు. అమెరికా వినియోగదారుల ధరల సూచికలో దాదాపు 20% దిగుమతి ఖర్చులకు సున్నితంగా ఉండటమే అందుకు కారణం.
 
అంటే,  ఎస్‌బీఐ అంచనా ప్రకారం, సగటు అమెరికన్ కుటుంబానికి వార్షికంగా $2,400 నష్టం వాటిల్లుతుంది. అధిక ఆదాయ కుటుంబాలకు $5,000 వరకు తక్కువ ఆదాయ సమూహాలకు అనుపాత భారం దాదాపు మూడు రెట్లు పెరుగుతుంది. దీనికి విరుద్ధంగా, 2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ జిడిపి కేవలం 25–30 బేసిస్ పాయింట్లను మాత్రమే కోల్పోతుందని అంచనా వేసింది.
 
ఎగుమతులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, రత్నాలు, ఆభరణాలు, సౌర మాడ్యూల్స్ దెబ్బతింటాయి. కానీ భారతదేశపు  వైవిధ్యభరితమైన వాణిజ్య ప్రొఫైల్, పీఎల్ఐ పథకం వంటి విధాన మద్దతు ప్రభావాన్ని తగ్గిస్తాయి.  ఎస్‌బీఐ లోతైన వ్యూహాత్మక డైనమిక్స్‌ను కూడా ప్రస్తావించింది.
 
ఇది సుంకాల పెంపుదలతో బ్రిక్స్, గ్లోబల్ సౌత్‌లో భారత్ మరింత చురుకైన పాత్ర వహించేందుకు దారితీస్తుందని అంచనా వేసింది.  భారత్ సార్వభౌమాధికారంపై రాజీ పడటానికి నిరాకరించడం, బహుళ ధ్రువ వాణిజ్య పొత్తుల కోసం వాషింగ్టన్ ప్రతీకార వైఖరి  ప్రేరేపించి ఉండవచ్చని సూచిస్తుంది. ఈ నివేదిక అమెరికా విధానంలోని వైరుధ్యాలను కూడా వెల్లడించింది. 
 
రక్షణాత్మక సుంకాలను విధిస్తూనే, అమెరికా ఏకకాలంలో దూకుడు క్రిప్టో చట్టం ద్వారా డిజిటల్ ఫైనాన్స్‌పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తోంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14178, జీనియస్ చట్టం ఆర్థిక వ్యవస్థలో స్టేబుల్‌కాయిన్‌లను ఏకీకృతం చేయడానికి, క్రిప్టో సంస్థలు సాంప్రదాయ బ్యాంకింగ్‌ను దాటవేయడానికి అనుమతించడానికి రూపొందించారు. ఈ చర్యలు అమెరికా డాలర్‌పై నమ్మకాన్ని పణంగా పెడుతున్నట్లు  ఎస్‌బీఐ