దర్యాప్తు సమయంలో మోదీ, భగవత్ పేర్లు చెప్పమని వత్తిడి!

దర్యాప్తు సమయంలో మోదీ, భగవత్ పేర్లు చెప్పమని వత్తిడి!

* మాలేగావ్‌ పేలుళ్లు కాంగ్రెస్‌ కుట్ర

2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఇటీవల నిర్దోషిగా విడుదలైన మాజీ బిజెపి ఎంపీ  ప్రజ్ఞా ఠాకూర్ శనివారం మాట్లాడుతూ, దర్యాప్తు సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రామ్ మాధవ్, ఇంద్రేష్ కుమార్, ఇతరుల పేర్లు చెప్పమని దర్యాప్తు అధికారులు తనను బలవంతం చేశారని, బెదిరించారని ఆరోపించారు.
2008 మాలేగావ్‌ పేలుళ్లు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కుట్రని ప్రజ్ఞా ఠాకూర్​ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి, ఈ కేసులో బీజేపీని ఇరికించడానికి కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసిందని ఆమెఆమె  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును దేశద్రోహం నేరం కింద విచారిణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆనాటి పేలుళ్లకు బీజేపీని కారణంగా చూపాలని ప్రయత్నాలు చేసిన వారికి కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని అంటూ ఆమె మండిపడ్డారు.
కాంగ్రెస్‌వి మతతత్వ రాజకీయాలని, ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసుల్లో ఇరికించి, తమను జైళ్లలో హింసించారని ఆమె ధ్వజమెత్తారు.
 గురువారం ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రజ్ఞా ఠాకూర్‌తో పాటు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ మరియు మరో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. ఏడుగురు నిందితులపై “విశ్వసనీయమైన మరియు బలమైన ఆధారాలు లేవు” అని కోర్టు తన తీర్పును ప్రకటించింది. ఉగ్రవాదానికి మతం లేదని పేర్కొన్నందున, “ఏ మతం హింసను బోధించదు” అని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
అయితే, దర్యాప్తు సమయంలో తాను ఎవరి పేర్లను చెప్పలేదని ప్రజ్ఞా ఠాకూర్ స్పష్టం చేశారు.  దర్యాప్తు అధికారులు తనను హింసించారని చెబుతూ, తనను నిర్దోషిగా విడుదల చేయడం సనాతనానికి,  సత్యానికి విజయం అని ఆమె తెలిపారు. “వారు నన్ను కొన్ని పేర్లు చెప్పాలని కోరుకున్నారు. దీని కోసం, వారు నన్ను హింసించారు. నా ఊపిరితిత్తులు ఆగిపోయాయి. నన్ను చట్టవిరుద్ధంగా ఆసుపత్రిలో నిర్బంధించారు. ఇవన్నీ నా కథలో రాస్తాను” అని చెప్పారు. 
 
“నేను గుజరాత్‌లో నివసించాను, కాబట్టి వారు నన్ను ప్రధాని మోదీ పేరు చెప్పాలని కోరుకున్నారు. అయితే, నేను ఎవరి పేర్లను చెప్పలేదు” అని ఆయన పేర్కొన్నారు. “వారు ‘ఈ పేర్లు చెప్పండి.. మేము మిమ్మల్ని హింసించాము” అని ఆమె ఆరోపించారు.  ఠాకూర్ కోర్టు తీర్పును స్వాగతిస్తూ దీనిని కాషాయ విజయంగా అభివర్ణించారు.
 
“ఈ రోజు భగవంతుడు గెలిచాడు. న్యాయం గెలిచింది. భగవానుడిని ఎవరు అవమానించినా, దేవుడు వారిని శిక్షిస్తాడు” అని ఆమె మీడియాతో స్పష్టం చేశారు. లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ కూడా తీర్పును స్వాగతించారు. తాను మునుపటిలాగే, అదే ఉత్సాహంతో దేశానికి సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు.
“ఏ దర్యాప్తు సంస్థ తప్పు కాదు; ఈ ఏజెన్సీలలో పనిచేస్తున్న వ్యక్తులే తప్పు. ఈ దేశం గొప్పది. తప్పు వ్యక్తులు తలెత్తకుండా, మనలాంటి వారిని బాధపెట్టకుండా మనం జాగ్రత్త వహించాలి” అని ఆయన సూచించారు.