
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు పెట్టినట్టు ఆదివారం వచ్చిన ఓ బెదిరింపు కాల్, మహారాష్ట్ర నాగ్‌పూర్పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతను కలిగించింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, మంత్రిగారి ఇంట్లో బాంబు పెట్టినట్టు చెప్పడంతో, పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తం అయింది. గడ్కరీ నాగ్ పూర్ నివాసాన్ని పేల్చేస్తామంటూ అజ్ఞాత వ్యక్తి నుంచి ఆదివారం ఉదయం 8.46 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది.
వార్దా రోడ్డులోని గడ్కరీ ఇల్లు పేల్చేస్తామని సమాచారం రావడంతో పోలీసులు స్థానిక ప్రతాప్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు చేరుకుని ఇంటి పరిసర ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఇంటి లోపల, బయటి ప్రాంగణంలో అత్యంత జాగ్రత్తగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి మూలను జల్లెడ పట్టినా ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది నకిలీ బెదిరింపు కాల్ అని పోలీసులు ధృవీకరించారు.
గడ్కరీ నివాసంలో ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో అది ఉత్తుత్తి బెదిరింపేనని తేలినట్టు చెప్పారు. పట్టుబడిన నిందితుడికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, అతని ఫోన్ నుంచి కాల్ రావడంతో అరెస్టు చేసి మరింత సమాచారం రాబడుతున్నామని వివరించారు.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
ఐపీఎస్ ఆత్మహత్యలో హర్యానా డీజీపీ, ఎస్పీలపై కేసు
కేరళలో ముగ్గురు యుడిఎఫ్ ఎమ్మెల్యేల సైస్పెన్షన్