
అయితే రష్యాతో ఉన్న సంబంధాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. భారత్-రష్యాలది స్థిరమైన, కాల పరీక్షకు నిలిచిన బంధం అని తేల్చి చెప్పింది.
తాజా పరిణామాలపై భారత విదేశాంగశాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్కు ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను మూడో దేశం కోణంలో చూడవద్దని సూచించారు.
రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెప్పారు. దేశ ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
“పరస్పర ఆసక్తులు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య బలమైన సంబంధాల విషయంలో భారత్, యూఎస్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాయి. ఈ విషయంలో ఇరుదేశాలు ఎన్నో మార్పులు, సవాళ్లను ఎదుర్కొన్నాయి. అందువల్ల ముఖ్యమైన ఎజెండాపైనే మా దృష్టి సారించాం. ఇరుదేశాల భాగస్వామ్యం కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం” అని రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు.
భారత్-యూఎస్ రక్షణ సంబంధాలపై స్పందిస్తూ, ఇరు దేశాలు బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని రణధీర్ జైశ్వాల్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రక్షణ సంబంధాలు బలోపేతమయ్యాయన్న ఆయన, రానున్న రోజుల్లో అవి మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రష్యా నుంచి భారత్ చమురు కొనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్, ఆ రెండు దేశాలవి పతనమైన ఆర్థిక వ్యవస్థలని తీవ్ర విమర్శలు చేశారు.
మరోవైపు భారత్ చమురు కొనడం వల్లనే రష్యా- ఉక్రెయిన్‌పై యుద్ధాన్న కొనసాగించగలుగుతోందని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో వ్యాఖ్యానించారు. ఆంక్షల వల్ల అక్కడ చమురు చౌకగా లభిస్తోందని, దురదృష్టవశాత్తూ యుద్ధంలో అదే రష్యా మనుగడకు ఉపయోగపడుతోందని చెప్పారు. భారత్‌తో వాణిజ్య చర్చల్లో ఇదే తమను ఇబ్బందిపెట్టే అంశమని రుబియో తెలిపారు.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్