ఉత్త‌మ జాతీయ తెలుగు చిత్రంగా భ‌గ‌వంత్ కేస‌రి

ఉత్త‌మ జాతీయ తెలుగు చిత్రంగా భ‌గ‌వంత్ కేస‌రి
 
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించగా, ఈసారి టాలీవుడ్ సినిమాకు మూడు అవార్డులు లభించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరికి అవార్డు దక్కింది. ఉత్తమ యాక్షన్‌ (స్టంట్‌ కొరియోగ్రఫీ)లో హను-మాన్ చిత్రం అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ గేయ రచయితగా బలగంలో ఊరు పల్లెటూరు పాటకు గాను కాసర్ల శ్యామ్‌ అవార్డుకు ఎంపికయ్యారు.
డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అవార్డులు భారతీయ సినిమా రంగంలో విశేష కృషిచేసిన చిత్రాలకు, కళాకారులకు రాష్ట్రపతి చేతుల మీదుగా అందించనున్నారు. 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల వివరాలను కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్‌ మురుగన్‌కు జ్యూరీకి అంద‌జేశారు.

జాతీయ ఉత్త‌మ చ‌ల‌న చిత్రంగా 12త్ ఫెయిల్ అనే చిత్రానికి అవార్డ్ దక్కింది. ఇక జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డ్ ఈ సారి ఇద్ద‌రు న‌టుల‌కి ద‌క్కింది. షారూఖ్ ఖాన్ (జ‌వాన్), విక్రాంత్ మ‌స్సే( 12త్ ఫెయిల్) ఎంపిక‌య్యారు. ఉత్త‌మ న‌టిగా మిస్సెస్ ఛ‌ట‌ర్జీ వర్సెస్ నార్వే (హిందీ)లో రాణీ ముఖ‌ర్జీకి అవార్డ్ వ‌రించింది. ఉత్తమ దర్శకత్వం లో ది కేరళ స్టోరీ (హిందీ) సుదీప్తో సేన్ ని ప్రకటించారు.

ఈ ఏడాది కొన్ని భాషా చిత్రాలు, ప్రాంతీయ సినిమాలు సైతం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం విశేషం.  ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ “భగవంత్‌ కేసరి” కి అవార్డు దక్క‌గా, హనుమాన్ మూవీకి బెస్ట్ స్టంట్ కోరియోగ్రఫీ నేషనల్ అవార్డు ద‌క్కింది. చిత్రానికి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్స్ గా నందు, పృథ్వీ ప‌ని చేశారు. ఇక బలగం సినిమాలోని “ఊరు పల్లెటూరు” సాంగ్‌కు నేషనల్ అవార్డు ద‌క్కింది. ఈ గీత రచయిత కాసర్ల శ్యామ్ అవార్డ్ అందుకోనున్నారు.

ఇక  ఉత్తమ్ స్క్రీన్ ప్లే – బేబీ (సాయి రాజేష్ నీలం (షేరింగ్),  బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్- బేబీ (పివి ఎన్ఎస్ రోహిత్), బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకృతి వేణి (సుకుమార్ కుమార్తె) – గాంధీ తాత చెట్టు, ఉత్తమ చిత్రం యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ కామిక్ – హనుమాన్ లని జ్యూరీ సభ్యులు అనౌన్స్ చేశారు. ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్‌కు అవార్డు వరించింది.

జాతీయ చలన చిత్ర అవార్డులు ఫీచర్‌ ఫిల్మ్‌

  • ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌: 12th ఫెయిల్‌
  • ఉత్తమ దర్శకత్వం: ది కేరళ స్టోరీ (హిందీ) సుదీప్తో సేన్‌
  • ఉత్తమ నటుడు: జవాన్‌ (హిందీ) షారుక్‌ ఖాన్‌, 12th ఫెయిల్‌ (హిందీ) విక్రాంత్‌ మస్సే
  • ఉత్తమ నటి: మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే (హిందీ) రాణీ ముఖర్జీ
  • ఉత్తమ సహాయ నటుడు: పూక్కాలం (మలయాళం) విజయ రాఘవన్‌; పార్కింగ్‌ (తమిళ్‌) ముత్తుపెట్టాయ్‌ సోము భాస్కర్‌
  • ఉత్తమ సహాయ నటి: ఉల్లుకు (మలయాళం) ఊర్వశి; వష్‌ (గుజరాతీ) జానకీ బోడివాలా
  • బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: గాంధీతాత చెట్టు (తెలుగు) సుకృతివేణి; జిప్సీ (మరాఠీ) కబీర్‌ ఖండారీ; నాల్‌ 2 (మరాఠీ) త్రిష థోసర్‌, శ్రీనివాస్‌ పోకలే, భార్గవ్‌ జగ్దీప్‌
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: బేబీ (ప్రేమిస్తున్నా..) పీవీఎన్‌ ఎస్‌ రోహిత్‌
  • ఉత్తమ నేపథ్య గాయని: జవాన్‌ (చెలియా) శిల్పారావు
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది కేరళ స్టోరీ (హిందీ) పసంతను మొహపాత్రో
  • ఉత్తమ సంభాషణలు: సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై (హిందీ) దీపక్‌ కింగ్రానీ
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): పార్కింగ్‌ (తమిళ్‌) రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌; బేబీ (తెలుగు) సాయి రాజేశ్‌ నీలం
  • ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: యానిమల్‌ (హిందీ) సచిన్‌ సుధాకరన్‌, హరి హరన్‌ మురళీ ధరన్‌
  • ఉత్తమ ఎడిటింగ్‌: పూక్కాలమ్‌ (మలయాళం) మిధున్‌ మురళి
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: 2018 (మలయాళం) మోహన్‌దాస్‌
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సామ్‌ బహదూర్‌ (హిందీ)
  • ఉత్తమ మేకప్‌: సామ్‌ బహదూర్‌ (హిందీ) శ్రీకాంత్‌దేశాయ్‌
  • ఉత్తమ సంగీతం (నేపథ్యం): యానిమల్‌ (హిందీ) హర్షవర్థన్‌ రామేశ్వర్‌
  • ఉత్తమ సంగీత దర్శకత్వం; వాతి (తమిళ్‌) జీవీ ప్రకాశ్‌ కుమార్‌
  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం: రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ (హిందీ)
  • ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం:  సామ్‌ బహదూర్‌ (హిందీ)
  • ఉత్తమ పరిచయ దర్శకుడు: ఆత్మపాంప్లెట్‌ (మరాఠీ) ఆశిష్‌ బెండే
  • ఉత్తమ బాలల చిత్రం: నాల్‌ (మరాఠీ)
  • ఉత్తమ యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ మూవీ: హనుమాన్‌ (తెలుగు)

నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ కేటగిరి

  • స్పెషల్‌ మెన్షన్‌ చిత్రాలు
  • నేకల్‌: క్రానికల్‌ ఆఫ్‌ ప్యాడీ మ్యాన్‌ (మలయాళం)
  • ది సీ అండ్‌ సెవెన్‌ విలెజెస్‌ (ఒడియా)
  • బెస్ట్‌ స్క్రిప్ట్‌: సన్‌ ఫ్లవర్స్‌ వోర్‌ ది ఫస్ట్‌ వన్స్‌ టు నో (కన్నడ)
  • బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: ది సేక్రెడ్‌ జాక్‌ – ఎక్స్‌ప్లోరింగ్‌ ది ట్రీస్‌ ఆఫ్‌ విషెస్‌ (ఇంగ్లీష్‌)
  • బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: ది ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)
  • బెస్ట్‌ ఎడిటింగ్‌: మూవీంగ్‌ ఫోకస్‌ (ఇంగ్లీష్‌)
  • బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: దుందగిరి కే ఫూల్‌ (హిందీ)
  • బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: లిటిల్‌ వింగ్స్‌ (తమిళ్‌)
  • బెస్ట్‌ డైరెక్షన్‌: ది ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)
  • బెస్ట్‌ ఎడిటింగ్‌: మూవీంగ్‌ ఫోకస్‌ (ఇంగ్లీష్‌)
  • బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: దుందగిరి కే ఫూల్‌ (హిందీ)
  • బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: లిటిల్‌ వింగ్స్‌ (తమిళ్‌)
  • బెస్ట్‌ డైరెక్షన్‌ : ది ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)
  • బెస్ట్‌ ఆర్ట్స్‌/కల్చర్‌ ఫిల్మ్‌: టైమ్‌లెస్‌ తమిళనాడు (ఇంగ్లీష్‌)
  • బెస్ట్‌ బయోగ్రాఫికల్‌ ఫిల్మ్‌: మా బావు, మా గావ్‌ (ఒడిశా), లెంటినో ఓవో ఏ లైట్‌ ఆన్‌ ది ఈస్ట్రన్‌ హారిజాన్‌ (ఇంగ్లీష్‌
  • ఉత్తమ పరిచయ దర్శకుడు: మావ్‌: ది స్పిరిట్‌ డ్రీమ్స్‌ ఆఫ్‌ చెరా (మిజో
  • బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ప్లవరింగ్‌ మ్యాన్‌ (హిందీ)