
ఆరు భారతీయ చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ నుండి చమురు, చమురు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయని, ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13846 కింద అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినట్లని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్‌లోని ఆరు సంస్థలతో పాటు 20సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించినట్లు తెలిపింది.
చమురు విక్రయాల నిధులతో ఇరాన్ మధ్యప్రాచ్యంలో సంఘర్షణలు, అస్థిరతకు ఆజ్యం పోసేందుకు, తమ ప్రజలను అణచివేసేందుకు, మరియు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తోందని అమెరికా ఆరోపించింది. వాటిని అరికట్టేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆల్‌కెమికల్ సొల్యూషన్స్, కాంచన్ పాలిమర్స్, రమణిక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ, జుపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఇండిస్టియల్ కెమికల్స్ లిమిటెడ్, పర్సిస్టెంట్ పెట్రో కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. ఈ భారతీయ సంస్థలన్నీ ఇరాన్ నుండి పెట్రో కెమికల్ ఉత్పత్తులను కొనుగోలు, సంపాదించడం, అమ్మకం, రవాణా లేదా మార్కెటింగ్ కోసం ముఖ్యమైన లావాదేవీలో ఉద్దేశపూర్వకంగా పాల్గనడం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13846లోని సెక్షన్ 3(ఎ)(3) లో చేర్చినట్లు తెలిపింది.
ఈ ఆంక్షల ప్రకారం అమెరికాలో లేదా అమెరికా వ్యక్తుల నియంత్రణలో ఉన్న ఈ కంపెనీల ఆస్తిలోని అన్ని ఆస్తులను బ్లాక్ చేయబడతాయని వెల్లడించింది. ఇప్పటికే బ్లాక్ చేయబడిన వ్యక్తి లేదా కంపెనీ యాజమాన్యంలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సంస్థ లేదా కంపెనీని కూడా బ్లాక్ చేస్తాయని పేర్కొంది.
More Stories
రైల్లో అమ్మే వాటర్ బాటిళ్ల ధర తగ్గింపు
జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న ఆహార వస్తువుల ధరలు
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు