తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో జరిగిన పలు అక్రమాలు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. సరోగసీ చేయక పోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఈ విషయాన్ని డాక్టర్ నమ్రత అంగీకరించారని పేర్కొన్నారు. రాజస్థాన్ దంపతులను సరోగసీ విషయంలోనూ నమ్రత మోసం చేశారు. వాళ్లు డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
డాక్టర్ నమ్రత కొన్ని రోజుల సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని వారికి చెప్పారు. వారు వినకపోవడంతో తన కుమారుడితో రాజస్థాన్ దంపతులను బెదరించారు. సరోగసీ పేరుతో సృష్టి సెంటర్ చాలా మోసాలు చేసింది. ఎపిలో కొంతమంది ఎఎన్ఎంల సహాయం కూడా తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి ఆనస్థీషియాన డాక్టర్ సదానందం వీరికి పూర్తిస్థాయిలో సహకరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అక్రమ సరోగసీ, శిశు విక్రయాలకు సంబంధించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ ఆథలూరి నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణతో సహా మరికొంత మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సరోగసీ పేరిట శిశు అక్రమ విక్రయాలకు పాల్పడిన డాక్టర్ నమ్రత, జయంత కృష్ణలను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు సికింద్రాబాద్ కోర్టును కోరారు.
నమ్రత వద్ద సరోగసీ, ఐవిఎఫ్ కోసం వచ్చిన వారి వివరాలు లభ్యమయ్యాయని, మరిన్ని విషయాలు రాబట్టేందుకు వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గురువారం డాక్టర్ నమ్రతను 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది ఈ మోసాల్లో సహకరించిన వైజాగ్ సృష్టి బ్రాంచ్ మేనేజర్ కల్యాణికి డా. నమ్రత ఖరీదైన విల్లా బహుమతిగా అందజేసినట్లు తెలిసింది.
ఆక్రమ సరోగసీ, నవజాత శిశువుల కొనుగోలులో కల్యాణి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అక్రమాల ద్వారా వచ్చిన ఆదాయంలో కల్యాణికి డాక్టర్ నమ్రత భాగం ఇచ్చిన్నట్లు గుర్తించారు. సృష్టి ఫెర్టిలిటీ లావాదేవీల వ్యవహారాలు మొత్తం కల్యాణి చూసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో తేలింది. కాగా, విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ భవనంలో క్షుద్ర పూజలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిర్మాణ దశలో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్ భవనంలో క్షుద్ర పూజలు చేసినట్లు ఆధారాలు దొరికాయి.
ఇంటర్మీడియట్ కూడా పాసవ్వని కీలక నిందితురాలు, డా. నమ్రతకు నమ్మిన బంటులా వ్యవహరించి కేసులో ఏ3గా ఉన్న కళ్యాణి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పోలీసులు ప్రస్తావించారు. హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతా సెంటర్లకు ఆమెకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది. అనంతరం మెల్లగా తన పథకాన్ని నమ్రత కళ్యానికి వివరించింది.
సరోగసి పేరుతో డబ్బులు వసూసు చేసి పిల్లలు విక్రయానికి సిద్దంగా ఉన్న వారితో కోఆర్డినేట్ చేసే దందాలోకి దింపింది. ఈ అక్రమ దందాలో కళ్యాణి కీలక పాత్ర వహించింది. ఇప్పటి వరకూ ఇదే తరహాలో పిల్లలను లక్ష రూపాయలకు కొనుగోలు చేసి సరోగసి కి ఒప్పించిన తల్లిదండ్రులకు కట్టబెడుతున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. విచారణలో ఈ విషయాలు ఒప్పుకున్నట్లు ప్రస్తావించారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము