ప్రపంచంలో అత్యధిక వలసదారులు భారత్‌ నుంచే

ప్రపంచంలో అత్యధిక వలసదారులు భారత్‌ నుంచే
 
ప్రపంచవ్యాప్తంగా వలసదారుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో అత్యధికం భారతీయులే అని ఐరాస వెల్లడించింది. 2024 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 1.85 కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నట్టు, ఇది ప్రపంచ వలసదారుల్లో 6 శాతం అని తెలిపింది
 
 2024 నాటికి 1.85 కోట్ల మంది భారతీయులు విదేశీ దేశాలలో నివసిస్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. మొత్తం 30.4 కోట్ల మంది అంతర్జాతీయ వలసదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని తెలిపింది. 2020లో ఈ సంఖ్య 27.5 కోట్లుగా ఉండగా, నాలుగేళ్లలోనే గణనీయమైన వృద్ధి చోటుచేసుకుంది. అంతర్జాతీయ వలసదారుల సంఖ్యలో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారతీయుల తర్వాత చైనా (1.17 కోట్లు), మెక్సికో (1.16 కోట్లు), ఉక్రెయిన్ (98 లక్షలు), రష్యా (91 లక్షలు) దేశాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. 
ఇది భారతీయుల అంతర్జాతీయ మైగ్రేషన్ స్థాయి ఇతర దేశాలతో పోలిస్తే ఎంత ఎక్కువగా ఉందో చూపిస్తుంది.  ఒకప్పుడు మధ్య ఆసియా దేశాలకే పరిమితమైన భారతీయ వలస సముదాయం ఇప్పుడు పశ్చిమ దేశాలకు బదిలీ అయ్యింది. పశ్చిమాసియాలోని ఇండియన్‌ డయాస్పొరాను తీసుకుంటే యూఏఈలోని మొత్తం జనాభాలో 40 శాతం (ఇంచుమించు మూడో వంతు) భారతీయ వలసదారులే ఉన్నారు. ఇక అమెరికాలో ఇండో అమెరికన్లు రెండో అతిపెద్ద ఆసియన్‌ గ్రూప్‌గా ఉన్నారు. మొదటి స్థానంలో చైనీస్‌ అమెరికన్లు ఉన్నారు.
 
యూఏఈలో 32.5 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అమెరికాలో ఇండో- అమెరికన్లు రెండో అతిపెద్ద ఆసియన్‌ కమ్యూనిటీగా ఉన్నారు. అమెరికాలో 31.7 లక్షల భారతీయులు నివసిస్తున్నారు.సౌదీ అరేబియాలో సుమారు 19.5 లక్షల మంది భారతీయులు ఉండగా, కెనడాలో10.2 లక్షల భారతీయులు నివసిస్తున్నారు.