
మరోవైపు అమిత్ షా మాట్లాడడం ప్రారంభించగానే ప్రతిపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశాయి. కానీ సభాధ్యక్షులు విపక్షాల డిమాండ్ను అంగీకరించలేదు. దీంతో వారు వాకౌట్ చేశారు. అమిత్షా ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర హోం మంత్రి చిదంబరంపై విమర్శలు గుప్పించారు.
“చిదంబరం నా రాజీనామా కోరారు. పహల్గాంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందినవారని రుజువు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆపరేషన్ సిందూర్ సమర్థతను కూడా చిదంబరం సవాల్ చేశారు. అంటే కాంగ్రెస్ కు జాతీయ భద్రత కన్నా రాజకీయాలు ముఖ్యం. అది ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయింది” అని ఆరోపించారు.
“కాంగ్రెస్ మనస్తత్వాన్ని చిదంబరం ప్రపంచానికి బహిర్గతం చేశారు. ఓటు బ్యాంకు కోసం వారు పాకిస్తాన్, లష్కరే తోయిబాతో సహా ఉగ్రవాదులు అందరికీ మద్దతు ఇస్తారు” అని అమిత్ షా విమర్శల వర్షం కురిపించారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్ ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరు పెట్టడాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ ను అమిత్ షా ఎద్దేవా చేశారు.
“శివాజీ మహారాజ్ మొఘలులపై పోరాడినప్పుడు, ఆయన యుద్ధ నినాదం హరహర మహాదేవ్. వాస్తవానికి భారతీయ సైనికులు వివిధ యుద్ధ నినాదాలు మతాలపై ఆధారపడి ఉంటాయి. అయితే వాటికి హిందూ, ముస్లింలతో సంబంధం లేదు” అని స్పష్టం చేశారు. “ఉగ్రవాదులను తుదముట్టించేందుకు మన సీఆర్పీఎఫ్, సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు చాలా కృషి చేశారు. కష్టతరమైన భూభాగంలో ఉంటూ, డ్రోన్ల ద్వారా పంపే ఆహారాన్ని తిన్నారు. ఇలా ఉగ్రవాదులను వెంబడించి వారికి తుదముట్టించారు.” అని రాజ్యసభలో అమిత్ షా చెప్పారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం