
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రభుత్వం 1,400కిపైగా డిజిటల్ మీడియా యూఆర్‌ఎల్ లను బ్లాక్ చేసిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభకు తెలిపారు. పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న సోషల్ మీడియా ఖాతాలు ఈ యూఆర్‌ఎల్స్‌తో తప్పుదారి పట్టించేలా, భారత్ వ్యతిరేక కంటెంట్ వ్యాప్తి చేస్తున్నాయని చెప్పారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు భారత్ వెలుపలి నుంచి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో తప్పుడు, హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేసినట్లు పేర్కొన్నారు. అందుకే 1400కిపైగా యూఆర్‌ఎల్స్‌లను బ్లాక్ చేయాలని మంత్రిత్వశాఖ ఆదేశించిందని చెప్పారు. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతను కాపాడుకునేందుకు సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69ఎ కింద ఈ చర్య తీసుకున్నట్లు వైష్ణవ్ చెప్పారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అడిగిన ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.
జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా ఉండాలని ప్రభుత్వం మీడియాకు సూచించిందని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా వివిధ విభాగాలు, ఏజెన్సీల మధ్య సమన్వయంతో ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇది 24గంటలు పని చేస్తూ మీడియాకు తాజా సమాచారాన్ని ఇచ్చిందని వివరించారు.
ఈ క్రంటోల్ రూమ్‌లో సైన్యం, నేవీ, వైమానిక దళం ప్రతినిధులు, ప్రభుత్వ మీడియా విభాగాల అధికారులు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారులు ఉన్నారన్నారు. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే పోస్ట్‌లు, హ్యాల్స్‌ను గుర్తించినట్లు చెప్పారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కింద ఉన్న ఫ్యాక్ట్ చెక్ టీమ్ విభాగం సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తల వనరులను పర్యవేక్షించిందని, ఫేక్ ఫొటోలు, ఎడిట్ వీడియోలు, తప్పుదారి పట్టించే ప్రకటనలు, ఆపరేషన్, ప్రభుత్వ సంస్థలు, భద్రతా దళాలకు వ్యతిరేకంగా కంటెంట్‌ను గుర్తించిందని వైష్ణవ్ చెప్పారు. ఈ యూనిట్ ఫేక్ న్యూస్‌ను ఎప్పటికప్పుడు తిప్పికొట్టిందని.. సరైన సమాచారాన్ని అందించిందని తెలిపారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు