
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. దీంతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ఆగస్టు 13 తరువాత మరో ఆరు నెలలు పొడిగింపు ఉంటుంది. బుధవారం ఈ తీర్మానాన్ని లోక్‌సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రారు ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆందోళన మధ్య ఈ తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదించారు.
మణిపూర్‌లో ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించామని, ఏప్రిల్ 2న సభ దానిని ఆమోదించిందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదం ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతుందని ఆయన చెప్పారు. మణిపూర్ సంక్షోభాన్ని ”మానవ కల్పిత విపత్తు” అని కాంగ్రెస్ ఎంపి ఆంటో ఆంటోనీ అభివర్ణించారు. మణిపూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపి ఎబి అకోయిజామ్ మాట్లాడుతూ రాష్ట్రపతి పాలన విధించే తీర్మానంపై గతంలో జరిగిన చర్చలో మణిపూర్‌కు చెందిన ఏ సభ్యుడిని మాట్లాడటానికి అనుమతించలేదని గుర్తు చేశారు.
మణిపూర్‌ను దేశానికి అణగదొక్కినట్లుగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతి నెలకొని ఉందని కేంద్ర హౌం సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుండి, గత నాలుగు నెలల్లో ఒకే ఒక్క మరణం సంభవించి, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదనని తెలిపారు. అంతకు ముందు తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో గందరగోళం నెలకొంది.
అధికార, ప్రతిపక్ష ఎంపిల వాగ్వాదానికి దిగడంతో లోక్‌సభ ర్యకలాపాలు అరగంట పాటు వాయిదా పడ్డాయి. సభా కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన కుమారి సెల్జా సభ్యులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కానీ రెండు వైపుల నుండి నిరంతర నినాదాల హోరెత్తడంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
More Stories
జమ్ముకశ్మీర్‌లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!