 
                మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్ – ఆరు రాష్ట్రాలలోని 13 జిల్లాలను కవర్ చేసే నాలుగు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులు భారత రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను 574 కిలోమీటర్లు పెంచుతాయని ఆయన తెలిపారు.
పిఎం-గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద ప్రణాళిక చేయబడిన ఈ ప్రాజెక్టులలో ఇటార్సి-నాగ్‌పూర్ నాల్గవ లైన్, ఛత్రపతి సంభాజీనగర్-పర్భాని డబ్లింగ్, అలుబారి రోడ్-న్యూ జల్పైగురి మూడవ, నాల్గవ లైన్, డంగోపోసి-జరోలి మూడవ, నాల్గవ లైన్ ఉన్నాయి. 
ఈ ప్రాజెక్టులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ‘నవ భారతదేశం’ దార్శనికతకు, దేశాన్ని ‘ఆత్మనిర్భర్’ (స్వావలంబన)గా మార్చాలనే దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టులు 2,300 గ్రామాలకు కనెక్టివిటీని పెంచుతాయని కూడా పేర్కొంది. “పెరిగిన లైన్ సామర్థ్యం చలనశీలతను గణనీయంగా పెంచుతుంది, ఫలితంగా భారతీయ రైల్వేలకు మెరుగైన కార్యాచరణ సామర్థ్యం మరియు సేవా విశ్వసనీయత పెరుగుతుంది” అని రైల్వేలు తెలిపాయి. “ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదనలు కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, రద్దీని తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాయి.”
 ప్రధాన మంత్రి కృషి సంపద యోజన కోసం కేబినెట్ వ్యయాన్ని పెంచింది 2017లో ప్రారంభించబడిన ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్వై) కోసం వ్యయాన్ని రూ.1,920 కోట్ల నుండి రూ.6,520 కోట్లకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని వైష్ణవ్ ప్రకటించారు, పెరిగిన నిధులను 50 బహుళ-ఉత్పత్తి ఆహార వికిరణ యూనిట్లు, 100 ఆహార పరీక్షా ప్రయోగశాలలకు ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు.
 “ఈ ఆమోదంలో కాంపోనెంట్ స్కీమ్-ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్, వాల్యూ అడిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఐసిసివిఎఐ), 100 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ (ఎఫ్టిఎల్) కింద 50 మల్టీ ప్రొడక్ట్ ఫుడ్ ఇరేడియేషన్ యూనిట్ల ఏర్పాటుకు మద్దతుగా రూ.1,000 కోట్లు ఉన్నాయి” అని ఆయన పేర్కొన్నారు. రూ.2వేల కోట్ల వ్యయంతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025-26 నుంచి 2028-29 వరకు నాలుగేళ్ల కాలానికి పథకం కోసం రూ.2వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వైష్ణవ తెలిపారు.
 నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్‌సీడీసీ  రూ.20వేల కోట్లు సేకరిస్తుందని, ఈ నిధులను కొత్త ప్రాజెక్టులు, పాంట్ల విస్తరణ, సహకార సంస్థలకు రుణాలు ఇవ్వడం, మూలధన అవసరాలను తీర్చేందుకు రుణాలు అందించేందుకు వినియోగిస్తుందని తెలిపారు. దీంతో 13,288 సహకార సంఘాల్లోని 2.9 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన తెలిపారు. 
దేశవ్యాప్తంగా పాడి పరిశ్రమ, పశువులు, మత్స్య సంపద, చక్కెర, వస్త్రాలు, ఆహార ప్రాసెసింగ్, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ వంటి వివిధ రంగాలలో కార్మికులతో పాటు మహిళల నేతృత్వంలో సహకార సంస్థలు నడుస్తున్నాయి.
                            
                        
	                    




More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
యమునా నదిని పరిశుభ్రం చేయడం అసాధ్యం కాదు!