 
                తెలంగాణ స్పీకర్ కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా నిర్ణయం తీసుకోవాలని రామచందర్ రావు కోరారు. గతంలో రాజీవ్ గాంధీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేశారని, అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ, గతంలో బీఆర్ఎస్ మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను లాక్కొని పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “జనహిత పాదయాత్ర” వాస్తవంగా జనహితమా లేదా ప్రజలను మోసం చేయడమా అనేది కాంగ్రెస్ స్పష్టంగా చెప్పాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, మహిళలు వంటి వర్గాలకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, మహిళలు వంటి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని చెబుతూ ఇదెలా జనహితమవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు, మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు, డిక్లరేషన్ల అమలుపై ఎంత మేరకు నెరవేరాయో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, అప్పుడే వారికి పాదయాత్ర చేయగల నైతిక హక్కు ఉంటుందని స్పష్టం చేసారు.




More Stories
హైదరాబాద్ లో దేశీయ తొలి ప్రైవేట్ రాకెట్
అజారుద్దీన్కు మంత్రి పదవిపై బీజేపీ ఫిర్యాదు
జూబ్లీ హిల్స్ లో ఓటమి భయంతో మంత్రివర్గంలోకి హజారుద్దిన్