జమ్మూ కశ్మీర్ ప్రాంతం పూంచ్‌లో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రత బలగాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పూంచ్ ప్రాంతంలోని జెన్‌లో కంచె వెంబడి బుధవారం అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తుల కదలికలను భద్రతా బలగాలు గుర్తించాయి. తొలుత భద్రతా బలగాల వినికిడి రావడంతో తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
భద్రతా బలగాలు జరిపిన కాల్పులు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా హత మార్చిన రోజుల వ్యవధిలోనే ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం.
పూంచ్ సెక్టార్‌లోని జెన్ ప్రాంతంలో కంచె వెంబడి బుధవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా దళాలు వెంటనే కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

More Stories
దేశంలో తొలిసారిగా సంచార పశు పోషకుల గుర్తింపు
శబరిమలలో అపచారం.. సన్నిధానంలో సినిమా షూటింగ్
రాత్రికి రాత్రి ఇనుప వంతెన దొంగతనం