ఉక్రెయిన్ జైలుపై రష్యా దాడుల్లో 22 మంది మృతి

ఉక్రెయిన్ జైలుపై రష్యా దాడుల్లో 22 మంది మృతి
సోమవారం అర్ధరాత్రి రష్యా మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. తమ దేశంలోని జైలుపై రష్యాలకు దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 85 మంది గాయపడ్డారని వెల్లడించారు. ఉక్రెయిన్లోని జపోర్టియా అనే ప్రాంతంలో ఉన్న జైలుపై రష్యా దాడి చేసింది. బిలెన్కివ్స్యాలోని మరో కాలనీపై కూడా దాడులు చేసింది. ఈ దుర్ఘటనలో 25 మంది మృతిచెందారు. మరో 85 మంది గాయపడినట్లు ఇక్కడి అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో 42 మంది ఖైదీలకు తీవ్రంగా గాయాలయ్యాయి.  దాడిలో జైలు డైనింగ్‌ హాలుతో సహా పరిపాలనా, క్వారంటైన్‌ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నాయని వెల్లడించారు. మరో మూడంతస్తుల భవనం పాక్షికంగా దెబ్బతిన్నదని, ప్రసూతి ఆస్పత్రితో సహా పలు ఆస్పత్రుల్లోని వైద్య సౌకర్యాలు నాశనమయ్యాయని తెలిపారు. దాడులతో జైలులోని మిగతా ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని అధికారులు చెప్పారు. 
 
ఖైదీలను టార్గెట్ చేస్తూ దాడులు చేయడం చట్టవిరుద్ధమని, పౌరులు ఉండే జైళ్లను టార్గెట్ చేసి ఇలా దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఉక్రెయిన్ అధికారులు విమర్శించారు. రష్యా ప్రయోగించిన డ్రోన్ దాడుల్లో 32 డ్రోన్లను అడ్డుకున్నామని ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది.  ఇదిలా ఉండగా గత మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  ఇటీవల దాడులు మరింత ఉద్రిక్తమయ్యాయి.
రష్యా-ఉక్రెయిన్ ల మధ్యశాంతిని పునరుద్ధరించేందుకు అ మెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా- ఉక్రెయిన్ శాంతి చర్చలకు రావాలని ఇటీవల పుతిన్ కు 50రోజుల గడుపు విధించారు.  తాజాగా ఆ గడువును కూడా కుదించేశారు. రాబోయే 10-12 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని హెచ్చరించారు. లేకపోతే రష్యాపై సెకండరీ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అమెరికాతో పాటు ఇతర దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.