
మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని, ఎవరూ ఆప లేరంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో జగన్ జైలుకు వెళ్లక తప్పదని చెప్పుకొచ్చారు. జగన్ చేసిన అక్రమాలు చాలా ఉన్నాయని, అవి అందిరికీ తెలిసినవే అని కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా తెలిపారు.
ఏపీలో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని చెబుతూ ఈ ప్రాంతం నుంచి అనేకమంది ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కచ్చితంగా కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు. ఇక్కడ సాగునీటి వనరులు పెంచడం, ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పన వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వ సాయం చేస్తోందని తెలిపారు. ఆగస్టు 30వ తేదీన సంచార జాతుల సదస్సు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని చెప్పారు. బిజెపి రాయల సీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉందని చెబుతూ, శ్రీబాగ్ ఒప్పం దం ప్రకారం హైకోర్టు బెంచ్ ను కర్నూలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలదని మాధవ్ స్పష్టం చేశారు. తుంగభద్ర ఎల్ఎల్సి నుండి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా 70వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని పేర్కొంటూ అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజలు కూటమిని గెలిపించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పంచాయితీ నిధులు దారి మళ్లిం చిందని మండిపడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక నేరుగా పంచాయితీలకు నిధులు వస్తున్నాయని తెలిపారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బిజెపి జెండా గ్రామ గ్రామాన ఎగరాలని బిజెపి కార్యకర్తలకు మాధవ్ పిలుపిచ్చారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ