రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదంలో మలేషియా మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. థాయ్‌లాండ్, కంబోడియా దేశాలు కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. ఈ సరిహద్దు వివాదాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరుదేశాలపై ఒత్తిడి తెచ్చారు.
ఈ నేపథ్యంలో మలేషియా ప్రధాని ఇబ్రహీం ఆహ్వానం మేరకు సోమవారం మలేషియాలోని పుత్రజయలో జరిగిన చర్చలకు కంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్, థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్ హాజరయ్యారు. మలేషియాలోని చైనా, అమెరికా రాయబారులతో కలిసి మలేషియా ప్రధాని ఇబ్రహీం నివాసంలో చర్చలు జరిగాయి.
థాయ్‌లాండ్, కంబోడియా మధ్య గురువారం నుంచి ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో 35 మందికి పైగా మరణించారు. 1.65 మంది నిరాశ్రయులయ్యారు. ఘర్షణ పడుతున్న రెండు దేశాలతోపాటు 10 ఆగ్నేయాసియా దేశాలతో కూడిన ప్రాంతీయ సంఘం ఆసియన్‌కి సారథ్యం వహిస్తున్న మలేషియా కాల్పుల విరమణ జరపాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చింది.
థాయిలాండ్, కంబోడియా ఘర్షణలకు సరిహద్దు వివాదాలే కారణమని పైకి చెబుతున్నా, సరిహద్దుల్లోని హిందూ దేవాలయాల కోసమే ఇరుదేశాలు ఎన్నో ఏళ్లుగా కొట్టుకుంటున్నాయి. ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్ విహార్, ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం దశాబ్దలుగా ఇరుదేశాల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ ఆలయాల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి.

More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?