
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.78 టీఎంసీలుగా కొనసాగుతోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేసి 65,958 క్యూసెక్కులను సాగర్‌కు విడుదల జరుగుతోంది.
మరోవంక, ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారడంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590.00 (312.04టిఎంసి) అడుగులకుగాను ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల తర్వాత నెల రోజులు ముందుగానే అంటే జులైలో నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. మంగళవారం నాగార్జున సాగర్ గేట్లను మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా తెరిచారు.
కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో 23 గేట్లు ఎత్తివేశారు. తుంగభద్రలో 1,27,810 క్యూసెక్కులు చేరుతుండగా, 1,24,485 క్యూసెక్కులు నదికి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా గేట్ల సమస్య కారణంగా ఈ ఏడాది 80 టీఎంసీలే నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి నిల్వ 75.25 టీఎంసీలుగా కొనసాగుతోంది. తుంగభద్ర నదికి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తుంగభద్ర నది జలకళను సంతరించుకోవడంతో హోస్పేట్ డ్యాం నుంచి కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయంకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. దీంతో సుంకేసుల జలాశయం జలాశయం 21 గేట్లు ఎత్తి నీటిని ప్రవాహంను దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో లక్షా 10 వేలు క్యూసెక్కులుండగా, అవుట్ ఫ్లో లక్షా 34 వేల 37 క్యూసెక్కులుగా ఉంది. కేసీ కెనాల్ ద్వారా 1857 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీ, కాగా ప్రస్తుతం జలాశయం నీటి నీలువ 0.661 ఉంది.
More Stories
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు
తెలంగాణాలో మత పిచ్చి రాజకీయాలు సాగిస్తున్న కాంగ్రెస్