పహల్గాం ఉగ్రవాదులు `మావాళ్లే’.. ఒప్పుకున్న పాక్!

పహల్గాం ఉగ్రవాదులు `మావాళ్లే’.. ఒప్పుకున్న పాక్!
ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా పహల్గాం ఘటన జరిగింది. 26మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన వారని భారత్ ఎంత నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా దాన్ని అంగీకరించని పాకిస్థాన్ కుంటిసాకులను చెబుతూ వస్తున్నది. ఈ చర్యకు ప్రతిచర్యగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’  పేరుతో యుద్ధానికి దిగింది. అక్కడి పలువురి ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. 
 
అయితే తాజాగా `అమాయకులైన పాకిస్తానీ పౌరులు’ను భారత్ హతమారుస్తుంది అంటూ సీమాంతర ఉగ్రవాదులు అందరూ తమవారే అంటూ  పొరుగుదేశం పరోక్షంగా దొరికిపోయింది.  పహల్గాం దాడి జరిగిన 98 రోజుల తర్వాత  పహల్గాం దాడి కీలక నిందితుడు సులేమాన్‌ను భద్రతాదళాలు సోమవారం హతమార్చాయి. ఈ విషయాన్నీ హోంమంత్రి అమిత్ షా మంగళవారం పార్లమెంట్ కు తెలిపారు.
 
భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ మహాదేవ్‌’లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని అమిత్ షా ప్రకటించారు. లోక్‌ సభలో ఆపరేషన్‌ సిందూర్​పై జరుగుతున్న చర్చలో ఆయన పాల్గొంటూ ఆ ముగ్గురిలో ఒకరు అందులో పహల్గాం దాడి కీలక నిందితుడు సులేమాన్‌ ఉన్నాడని చెప్పారు.
 
ఆపరేషన్ మహాదేవ్ లో ముగ్గురు ఉగ్రవాదులను చంపడంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఏజెన్సీలు ఎన్ కౌంటర్లలో నిర్బంధించిన పాకిస్తానీలను చంపుతున్నారని చెప్పుకొచ్చింది. అలాగే వారిని సీమాంతర ఉగ్రవాదులు అని పిలుస్తున్నాయని పాకిస్థాన్ పేర్కొంది. పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థలు ఈ ఉగ్రవాదులను అమాయకులు, పాకిస్తానీలు అని పిలుస్తున్నాయి. 
 
అయితే, కాశ్మీర్ అడవుల్లో ఓ పాకిస్థాన్ పౌరుడు శాటిలైట్ ఫోన్, ఆయుధాలతో ఏం చేస్తున్నాడో అని దాని గురించి పాకిస్థాన్ పత్రిక డాన్ రాయలేదు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఓ ఎం4 కార్బైన్ రైఫిల్, 2ఎకే రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అవి నకిలీ ఎన్ కౌంటటర్లు అంటూ పాక్ పిచ్చిరాతలు ప్రపంచవ్యాప్తంగా భారత్ కు లభిస్తున్న మద్దతు, పాకిస్థాన్ కు ఎదురవుతున్న వ్యతిరేకతలతో సతమతమవుతున్న పాకిస్తాన్ తాజాగా నకిలీ వార్తలను ప్రచురిస్తున్నాయి.
 
 ఆంగ్ల వార్తా పత్రిక డాన్లో  ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఇండియాలో నకిలీ ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని పాకిస్థాన్ భద్రతా దళాలు పేర్కొన్నట్టు  పేర్కొంది. భారతదేశంలో 56 మంది పాకిస్తానీయులను అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్థాన్ పేర్కొంది. వారు అమాయకులు అని పాకిస్థాన్ ఉగ్రవాదులపై తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది.  పహల్గాం దాడి సూత్రధారి హషీం మూసా పాకిస్తాన్ సైన్యంలో పని చేసిన వ్యక్తి అని రాసుకొచ్చింది. ఉగ్రవాదిని ఎలైట్ యూనిట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ మాజీ కమాండో అని చెప్పడం గమనార్హం.
 
నెలరోజులుగా వెంటాడి చంపారు

కాగా, జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ సమీపంలో ఉన్న హర్వాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో గడిచిన నెల రోజులుగా ఆ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. లష్కరే, జైషే ఉగ్రవాదుల కదలికల కోసం గడిచిన 14 రోజులుగా మరింత ముమ్మరంగా నిఘాను పెంచాయి.  ఈ క్రమంలో ఈనెల 22న శాటిలైట్‌ ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా ఉగ్రవాదుల కదలికలను గుర్తించారు.

దాచిగామ్‌ నేషనల్‌ పార్క్‌ పరిసరాల్లో రెండు రోజుల కిందట అనుమానస్పద కమ్యూనికేషన్లను భారత సైన్యం పసిగట్టింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో దాచిగామ్‌ నేషనల్‌ పార్క్‌ పరిసరాల్లో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించిన భద్రతాదళాలు మెరుపు వేగంతో కాల్పులు జరిపాయి.  ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్‌ షాతో పాటు పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్‌ హతమైనట్టు అధికారులు తెలిపారు.

ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది అబూ హామ్‌జా కూడా హతమైనట్టు పేర్కొన్నారు. వీరందరూ విదేశీ ఉగ్రవాదులేనని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు పాలుపంచుకొన్నట్టు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ అనంతరం జరిపిన సోదాల్లో 17 గ్రెనెడ్లు, ఒక ఎం4 కార్బైన్‌, రెండు ఏకే 47 రైఫిల్స్‌ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకొన్నాయి.