కాగా, కామారెడ్డి బిసి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది బిసి డిక్లరేషన్ కాదని ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో 27 శాతం రిజర్వేషన్లు బిసిలకు అమలవుతున్నాయని, అదనంగా బిసిలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆ ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు న్నారని సంజయ్ కుమార్ ఆరోపించారు.
అంటే తెలంగాణలో వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించబోతోందని మండిపడ్డారు. అట్లాంటప్పుడు అది బిసి డిక్లరేషన్ ఎట్లా అవుతుంది? అది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే అని స్పష్టం చేశారు. బిసి జాబితా నుండి ముస్లింలను తొలగించేదాకా ఆ బిల్లును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.
ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బిసిలకు అమలు చేస్తేనే సంపూర్ణ మద్దతిచ్చి బిల్లు ఆమోదానికి కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పారు. 50 శాతం రిజర్వేషన్ల గేట్లను బద్దలు కొట్టడం ద్వారా హిందుత్వాన్ని దెబ్బకొడతామంటూ మొన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పత్రికల్లో చూసి హిందువులంటే ఎంత ద్వేషమో ఆయన మాటల్లోనే అర్ధమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఎపి బిజెపి ఎంపి సిఎం రమేశ్ చేసిన ఆరోపణలు అబద్ధమని చెబుతున్న కేటిఆర్ అందుకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. “నేను సవాల్ చేస్తున్నా. .వేదికను ఏర్పాటు చేస్తా..సిఎం రమేశ్‌ను తీసుకొస్తా. ఆధారాలతో సహా వివరిస్తా. డేట్, టైం ఫిక్స్ చెయ్… దమ్ముంటే చర్చకు రా” అని నిలదీశారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు