ఫిడే మహిళల వరల్డ్‌కప్ ఫైనల్లో దివ్య దేశ్‌ముఖ్ సంచలనం సృష్టించింది. ఫిడే వరల్డ్ కప్ గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఫైనల్లో కోనేరు హంపిపై ఆ యువ క్రీడాకారిణి విజయం సాధించింది. బ్లాక్ పీస్‌లతో ఆడిన దివ్య అద్భుతమైన రీతిలో తోటి భారతీయురాలు హంపిని ఓడించింది. హంపి ఘోర తప్పిదం చేసినట్లు విశ్వనాథన్ ఆందన్ తెలిపారు.
54వ మూవ్‌లో ఎఫ్ పాన్‌ను హంపి మూవ్ చేసిందని, దీని వల్ల దివ్య ఆ టైంలో తన పాన్‌ను ఫ్రీ స్పేస్‌లోకి తీసుకెళ్లిందన్నారు. ఇది దివ్యకు బాగా అడ్వాంటేజ్ అయినట్లు ఆయన తెలిపారు. దివ్య దేశ్‌ముఖ్ వయసు 19 ఏళ్లు. ఈ గెలుపుతో ఫిడే వరల్డ్‌కప్‌తో పాటు ఆమెకు గ్రాండ్‌మాస్టర్ టైటిల్ కూడా వచ్చేసింది. రెండుసార్లు వరల్డ్ విన్నర్ కోనేరు హంపిని ఓడించి విజేతగా నిలిచిందీ యవకెరటం.
భారత 88వ గ్రాండ్‌మాస్టర్‌గా హోదాను సొంతం చేసుకుంది దివ్య. అంతేకాదు వచ్చే ఏడాది టోర్నీకి అర్హత కూడా సాధించింది. జార్జియా వేదికగా జరిగిన ఫిడే మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో హంపి, దివ్య హోరాహోరీగా తలపడ్డారు. తనకంటే సీనియర్ అయిన తెలుగు తేజానికి 19 ఏళ్ల దివ్య గట్టి పోటీనిచ్చింది. ఈ మెగా టోర్నీ ఫైనల్లో తొలి రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించారిద్దరూ. దాంతో, ట్రై బ్రేకర్ అనివార్యమైంది.
ఈ రౌండ్‌లో వ్యూహాత్యక ఆటతో హంపిని మట్టికరిపించి టైటిల్ ఎగరేసుకుపోయింది దివ్య. ట్రోఫీతో పాటు రూ.43 లక్షల నగదు బహుమతి గెలుచుకుంది మహరాష్ట్ర ప్లేయర్. రన్నరప్ హంపి రూ.26 లక్షలు అందుకుంది. ఫిడే కప్‌ను గెలిచిన ఆనందంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది. హంపితో జరిగిన ఫైనల్ చాలా థ్రిల్లింగ్‌గా సాగింది.
విజయం తర్వాత దివ్య మాట్లాడుతూ దీన్ని అర్థం చేసుకోవడానికి తనకు టైం పడుతుందని, ఈ విక్టరీ ద్వారా తనకు గ్రాండ్‌మాస్టర్ టైటిల్ రావడం అదృష్టమని, ఈ టోర్నమెంట్‌కు ముందు తనకు ఎటువంటి గుర్తింపు లేదని, ఈ విక్టరీ చాలా విశేషమైందని, మునుముందు ఇంకా ఎంతో సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నది. గ్రాండ్‌మాస్టర్ టైటిల్ గెలిచిన 88వ భారత చెస్ ప్లేయర్ అయ్యింది దివ్య.
“భారత చెస్‌లో ఇది చరిత్రాత్మకమైన రోజు. మన దేశం నుంచి మరొక గ్రాండ్‌మాస్టర్ పుట్టుకొచ్చింది. ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో విజయం దివ్య ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేయనుంది. ఈ అద్భుత క్షణాలను ఆమెకు జీవితాంతం గుర్తుంటాయి. ఈ విక్టరీ దివ్యను భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించేందుకు దోహదపడుతుంది” అని ఐదుసార్లు ఛాంపియన్ ఆనంద్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
More Stories
ఆసియాకప్‌లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
సొంత ప్రజలపై పాక్ బాంబులు.. 30 మంది మృతి
కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్ అరెస్ట్