
* ఆహార ధాన్యాలు విషంతో కలుషితంపై ఆందోళన
దేశంలో ఆహార ధాన్యాలు విషంతో కలుషితం కావడంపై నాగపూర్ లోని రేషింబాగ్ స్మృతి మందిర్ కాంప్లెక్స్‌లోని మహర్షి వ్యాస్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కార్యవర్గ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని సామాన్య ప్రజలకు ఆరోగ్యకరమైన, పోషకమైన, విషరహిత ఆహారం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
ప్రాణాంతక పురుగుమందులు, కలుపు మందులు, బయో-స్టిమ్యులెంట్లు, హార్మోన్ ఉత్పత్తుల కారణంగా మన ఆహార ధాన్యాలు చాలా వరకు విషపూరితం కావడంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. వివిధ పరిశోధనల నుండి పొందిన సమాచారం ప్రకారం, అల్జీమర్స్, క్యాన్సర్, చర్మ వ్యాధులు, రొమ్ము క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులకు ప్రధాన కారణం రసాయన వ్యవసాయం ప్రభావం అని గుర్తు చేసింది.
గత 50 సంవత్సరాలలో, మన ప్రధాన ఆహార ధాన్యాల పోషక విలువలో 45 శాతం క్షీణతన మోదు కావడం, అలాగే, వ్యవసాయ వ్యయం, ధరల కమిషన్ ప్రకారం, రైతుల వ్యవసాయ ఉత్పత్తి ఖర్చు ఆదాయానికి అనుగుణంగా వేగంగా పెరుగుతుండటం ప్రస్తావిస్తూ ప్రస్తుతం ప్రబలంగా ఉన్న మార్కెట్ ఇన్‌పుట్ ఆధారిత వ్యవసాయ వ్యవస్థ దీనికి బాధ్యత వహిస్తుందని స్పష్టం చేసింది.
ఇదంతా వ్యవసాయ రంగానికి, వ్యవసాయానికి మంచి సంకేతం కాదని కిసాన్ సంఘ్ హెచ్చరించింది. ఆరోగ్యకరమైన, పోషకమైన మరియు విషరహిత ఆహారంపై ఆమోదించిన తీర్మానం గురించి అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా మాట్లాడుతూ, ఈ తీర్మానం ద్వారా, భారతీయ కిసాన్ సంఘ్ దేశంలోని రైతులు గో కృషి వాణిజ్య వ్యవస్థను పెద్ద ఎత్తున స్వీకరించాలని పిలుపిచ్చారు.
తద్వారా రసాయన రహిత, విషరహిత వ్యవసాయ ఉత్పత్తులను దేశ పౌరులకు అందుబాటులో ఉంచవచ్చని ఆయన సూచించారు. దేశంలోని విధాన నిర్ణేతలు 5 సంవత్సరాల వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్రమైన, ఆచరణాత్మకమైన, బలమైన వ్యవస్థగా గో కృషి వాణిజ్య వ్యవస్థను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దీనితో పాటు, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో, “గౌ-కృషి వాణిజయం” ఆధారంగా “ఆరోగ్యకరమైన భారతదేశం, పోషక భారత్” కోసం, అఖిల భారత కార్యవర్గ సమావేశం ప్రధానమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచింది:
1. అన్ని వ్యవసాయ ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలలో రసాయన అవశేషాలకు ప్రమాణాలను నిర్ణయించాలి.
2. దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలు, ధాన్యాలతో పాటు జీఎం లేని వాటిపై నాణ్యతా తనిఖీలను తప్పనిసరి చేయాలి. జీఎం లేని ఆహారాన్ని నిర్ధారించడానికి కఠినమైన చట్టాలను రూపొందించాలి.
3. ఆవు ఆధారిత సేంద్రీయ ఆహారం కోసం ఉత్పత్తి కొనుగోలు, మార్కెటింగ్, నిల్వ, పంపిణీ, బ్రాండింగ్, సరళమైన ధృవీకరణకు స్వతంత్ర, ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ఆవు ఆధారిత సేంద్రీయ ఆహారంలో గరిష్ట రసాయన అవశేషాలకు ప్రమాణాలను నిర్ణయించాలి. ఫలితంగా, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో, విదేశాలలో సరసమైన ధరలకు సులభంగా అమ్ముకోవచ్చు. పైగా ప్రధాన స్రవంతిలో సేంద్రీయ ఆహారాన్ని రసాయనాలతో కల్తీ చేసినందుకు దోషులను నేరస్థులుగా కఠినంగా శిక్షించేలా ఒక చట్టం చేయాలి.
4. వ్యవసాయం-పోషకాహార-ఆరోగ్య వ్యవస్థను విధాన రూపకల్పనలో సమగ్రపరచాలి. దీని కోసం అంకితమైన పరిశోధన, వనరులను నిర్ధారించాలి. తద్వారా ఆవు ఆధారిత సేంద్రీయ వ్యవసాయం సమగ్ర విధానంపై ఆధారపడిన శాస్త్రీయ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చు. రైతులు దానిని సులభంగా, నమ్మకంగా, ఆచరణాత్మకంగా స్వీకరించవచ్చు.
5. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి, ‘ఆరోగ్యకరమైన భారతదేశం, పోషక భారతదేశం’ కోసం ‘ఆవు-వ్యవసాయ వాణిజ్యం’ ఆధారంగా ఒక దృఢమైన వ్యూహాన్ని అవలంబించాలి.
6. మార్కెట్‌లో ప్రాణాంతకమైన, నిషేధిత, తక్కువ నాణ్యత గల పురుగుమందులు, కలుపు మందులను, రసాయన ఎరువులను విక్రయించే కంపెనీలపై కఠినమైన చట్టాలను అమలు చేయాలి. ఇది మార్కెట్‌లో రైతుల మోసాన్ని ఆపుతుంది.
కాగా, ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సరానికి సంబంధించిన సంస్థాగత, ఆందోళనాత్మక, నిర్మాణాత్మక అంశాలతో పాటు, సంస్థ విస్తరణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను చర్చించారు. దేశవ్యాప్తంగా 37 ప్రాంతాల నుండి కిసాన్ సంఘ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ అఖిల భారత కాంటాక్ట్ ప్రముఖ్, రామ్‌లాల్, కిసాన్ సంఘ్ అఖిల భారత సంఘటన కార్యదర్శి దినేష్ కులకర్ణి ముగింపు సమావేశాలు మార్గదర్శకత్వం చేశారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం