17మంది లోక్ సభ ఎంపీలకు ‘సంసద్ రత్న’ అవార్డులు

17మంది లోక్ సభ ఎంపీలకు ‘సంసద్ రత్న’ అవార్డులు

2025కుగాను లోక్సభలో మంచి పనితీరు కనబరిచిన 17 మంది ఎంపీలను సంసద్ రత్న అవార్డులకు ఎంపిక చేశారు. వారిలో సుప్రియా సులే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- శరద్చంద్ర పవార్), రవి కిషన్ (భారతీయ జనతా పార్టీ), నిషికాంత్ దూబే (బీజేపీ), అరవింద్ సావంత్ (శివసేన-ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) తదితర పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వరుసగా 3 పర్యాయాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి చేసిన స్థిరమైన కృషిని గుర్తించి నలుగురికి ప్రత్యేక జ్యూరీ అవార్డులు కూడా ప్రకటించారు.

వారు  భర్తృహరి మహతాబ్ (బీజేపీ, ఒడిశా), ఎన్కె ప్రేమచంద్రన్ (రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, కేరళ), సుప్రియా సూలే (ఎన్సీపీ, మహారాష్ట్ర), శీరంగ్ అప్ప బర్నే (శివసేన, మహారాష్ట్ర) వీరికి స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. వీరందరూ 16వ లోక్సభ నుంచి వీరు పార్లమెంట్లో అత్యుత్తమ పనితీరు కొనసాగించారు. ఇతర అవార్డులు గెలుచుకున్న ఎంపీల్లో ఉదయ్ వాఘ్ (బీజేపీ), నరేశ్ మహ్స్కే (శివసేన), వర్ష గైక్వాడ్ (కాంగ్రెస్), మేధా కులకర్ణి (బీజేపీ), ప్రవీణ్ పటేల్ (బీజేపీ), విద్యుత్ బరన్ మహతో (బీజేపీ), దిలీప్ సైకియా (బీజేపీ)లు ఉన్నారు.

ఇక కమిటీ విభాగాల విషయానికి వస్తే, భర్తృహరి మహతాబ్ అధ్యక్షతన పనిచేసే స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్, డాక్టర్  చరణ్జిత్ సింగ్ చన్నీ (కాంగ్రెస్) అధ్యక్షతన పనిచేస్తున్న స్టాండింగ్ కమిటీ ఆన్ అగ్రికల్చర్లకు, వారి నివేదికల నాణ్యత, పార్లమెంట్ పర్యవేక్షణకు చేసిన కృషికి మంచి గుర్తింపు లభించింది.

కాగా, పార్లమెంట్లో తరచుగా జరిగే అంతరాయాలు, ప్రభుత్వం కంటే ప్రతిపక్షానికే ఎక్కువ హాని కలిగిస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు హితవు చెప్పారు. తరచూ అంతరాయం కలిగిస్తూ ఉంటే, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంటే కీలకమైన అవకాశాన్ని కోల్పోతారని పేర్కొన్నారు. అంతేకాదు పార్లమెంట్ వాయిదాలు పడినప్పుడు అధికారులు కొన్నిసార్లు ఎలా రిలీఫ్ వ్యక్తం చేశారో కూడా గుర్తుచేశారు.