భారత సైన్యంలో శక్తివంతమైన `రుద్ర’ దళం

భారత సైన్యంలో శక్తివంతమైన `రుద్ర’ దళం

భారత సైన్యంలో శక్తివంతమైన దళం `రుద్ర’ను ఏర్పాటు చేస్తున్నట్టు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. శనివారంనాడు ‘కార్గిల్ విజయ దివస్’ సందర్భంగా కార్గిల్‌లోని వార్ మెమెరోయిల్ వద్ద ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, శత్రువుల ఆటకట్టించేందుకు, భవిష్యత్ ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆల్ ఆర్మ్ బ్రిగేడ్ రుద్రను ఏర్పాటు చేశామని చెప్పారు. దీనికి శుక్రవారంనాడు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

‘రుద్ర’ యూనిట్‌లో పదాతిదళం, యాంత్రిక పదాతిదళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి సేన, ప్రత్యేక దళాలు, మానవరహిత ఏరియల్ యూనిట్లు ఉంటాయని ద్వివేది తెలిపారు. సరిహద్దుల్లో శత్రువులు వణుకు పుట్టించేందుకు లైట్ కమెండో యూనిట్ ‘భైరవ్’ను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి పదాతిదళం ఇప్పుడు ఒక డ్రోన్ ప్లాటూన్ అని, ఆర్టిలరీలో శక్తిభాన్ రెజిమెంట్ ఉంటుందని, డ్రోన్, కౌంటర్-డ్రోన్, లోయిటరింగ్ మందుగుండు సామగ్రి వంటివి సన్నద్ధంగా ఉంటాయని చెప్పారు. 

రాబోయే రోజుల్లో మన సామర్థ్యం అనేక రెట్లు పెరగనుందని, స్వదేశీ క్షిపణులతో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌ను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు.  కాగా, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి ఉగ్రవాదాన్ని సహించేది లేదనే గట్టి సందేశాన్ని పాకిస్థాన్‌కు ఇచ్చామని ద్వివేది తెలిపారు. అలాగే పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తిచ‌ర్య అని పేర్కొంటూ పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి భార‌త్‌కు తీవ్ర గాయాన్ని ఏర్ప‌ర్చింద‌ని, అయితే ఈసారి భారత్ బాధ‌ప‌డ‌డమే కాదు, ఆ చ‌ర్య‌కు ప్ర‌తీకార చ‌ర్య‌ను కూడా చూపించింద‌ని తెలిపారు.  కార్గిల్ యుద్ధ వీరుల‌ను స్మ‌రించేందుకు మూడు ప్రాజెక్టుల‌ను ఆర్మీ చీఫ్ ప్రారంభించారు. 

అమ‌రులకు నివాళి అర్పించేందుకు ఈ-శ్ర‌ద్ధాంజ‌లి పోర్ట‌ల్‌ను ఆయ‌న ప్రారంభించారు. 1999 నాటి కార్గిల్ యుద్ధ గాధ‌లు వినేందుకు క్యూఆర్ కోడ్ ఆడియో గేట్‌వేను కూడా ఆయ‌న ప్రారంభించారు. కార్గిల్ యుద్ధ వీరుల స్మార‌కాన్ని విజిట్ చేయ‌కుండానే ప్ర‌జ‌ల త‌మ హీరోల‌కు ఈ-శ్ర‌ద్ధాంజ‌లి ప్ర‌క‌టించ‌వ‌చ్చు. ప్ర‌జ‌ల్లో ఆ నాటి యుద్ధ ప‌రిస్థితుల‌పై చైత‌న్యం తీసుకువ‌చ్చే ఉద్దేశంతో ఈ-శ్ర‌ద్ధాంజ‌లి ప్రారంభించారు.

ఇండ‌స్ వ్యూవ్ పాయింట్ అనే ప్రాజెక్టును కూడా లాంచ్ చేశారు. దీని వ‌ల్ల విజిట‌ర్స్ ఎల్వోసీ వ‌ద్ద‌కు వెళ్ల‌వ‌చ్చు. బ‌టాలిక్ సెక్టార్‌లోని ఎల్వోసీ ప్రాంతాన్ని ఇండ‌స్ వ్యూవ్‌పాయింట్‌తో చూడ‌వ‌చ్చు. కార్గిల్ యుద్ధ స‌మ‌యంలో బ‌టాలిక్ ప్రాంతం కీల‌కంగా నిలిచింది. ఇది సుమారు ప‌ది వేల అడుగుల ఎత్తులో ఉంది. కార్గిల్‌, లేహ్‌, బ‌ల్టిస్తాన్ వ్యూహాత్మ‌క లొకేష‌న్‌లో ఉంది.