
భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని కొనియాడుతూ ఇటీవలి ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో దేవేష్ పంకజ్, సందీప్ కూచి, దేవదత్ ప్రియదర్శి, ఉజ్వల్ కేసరీలు మెడల్స్ సాధించి దేశానికి గౌరవం తీసుకువచ్చారని ప్రశంసించారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో భారత విద్యార్థులు మూడు బంగారు, రెండు వెండి, ఒక కాంస్య పతకాన్ని గెలిచారని చెప్పారు.
ముంబయిలో వచ్చే నెల జరుగబోయే ఆస్ట్రానమి, ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ జరుగునుందని, ఇది అతిపెద్ద ఒలింపియాడ్ అవుతుందని చెప్పారు. భారత్ ఇప్పుడు ఒలింపిక్స్, ఒలింపియాడ్‌లో ముందుకెళ్తోందని పేర్కొన్నారు. యునెస్కో 12 మరాఠా కోటలను ప్రపంచవారసత్వ స్థలాలుగా గుర్తించిందని, ఇందులో 11 మహారాష్ట్రలో, ఒకటి తమిళనాడులో ఉన్నాయని తెలిపారు.
సల్హేర్ కోటలో మొఘలులు ఓడిపోయారని, ఛత్రపతి శివాజీ మహారాజ్ శివనేరిలో జన్మించారని, ఖండేరిలో సముద్రం మధ్యలో ఒక కోట ఉందని, శత్రువు ఆయనను ఆపాలని కోరుకున్నా శివాజీ మహారాజ్ అసాధ్యాన్ని సాధ్యం చేశాడని ప్రధాని వివరించారు. ప్రతాప్‌గఢ్ కోటలో అఫ్జల్ ఖాన్ ఓడిపోగా, విజయదుర్గ్‌లో రహస్య సొరంగాలున్నాయని, ఛత్రపతి శివాజీ మహరాజ్ దూరదృష్టికి ఈ కోట సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పారు. తాను రాయ్‌గఢ్ సందర్శించిన సమయంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ముందు నమస్కరించే అవకాశం తనకు లభించిందని తెలిపారు.
“మహారాష్ట్రలో 12 కోటలను ప్రపంచ వారసత్వ సంపదగా యూనెస్కో గుర్తించింది. కొన్నేళ్ల క్రితం రాయగఢ్‌కు వెళ్లాను. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అస్సాంలోని కజిరంగా నేషనల్‌పార్క్‌లో గడ్డి భూమి పక్షులకు నిలయం. అక్కడ 40 రకాలు ఉన్నాయి. టెక్నాలజీ బృందాలు వాటి కూతలు, ఏఐ ఆధారంగా లెక్కించాయి. టెక్నాలజీ, సెన్సివిటీ కలిస్తే ప్రతిదీ తేలిక అవుతుంది” అని మోదీ పేర్కొన్నారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం