
మాల్దీవులతో సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ ఆసక్తిగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సామర్థ్య నిర్మాణానికి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆ దేశ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శనివారం ఆ దేశ ఉపాధ్యక్షుడు హుసేన్ మహమద్ లతీఫ్ సహా పలువురు నేతలను కలుసుకొన్నారు.
60వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకొంటున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. అవసరమైన సమయంలో తమ దేశానికి భారత్ అండగా నిలుస్తున్నందుకు ప్రధానికి లతీఫ్ కృతజ్ఞతలు తెలిపారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. మాల్దీవుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, శనివారం దేశ ఉపాధ్యక్షుడు ఉజ్ హుస్సేన్ మహ్మద్, ఉపాధ్యక్షుడు హుస్సేన్ మహ్మద్ లతీఫ్ సహా పలువురు నేతలతో భేటీ అయ్యారు. భారత్- మాల్దీవుల మధ్య కీలక సంబంధాల అంశాలపై దృష్టి సారించారని తెలిపారు.
మౌలిక వసతులు, సాంకేతికత, వాతావరణ మార్పులు, ఇంధనం సహా పలు కీలక రంగాల్లో కలిసి పనిచేయడం కొనసాగించాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ సన్నిహిత సహకారం ఇరు దేశాలకూ లాభదాయకంగా వుంటుందని చెబుతూ ఈ భాగస్వామ్యం ఇంకా పెరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇరు దేశాల పార్లమెంట్‌ల మధ్య గల సన్నిహిత సంబంధాలతో పాటూ స్నేహ బంధం గురించి కూడా అందరం మాట్లాడుకున్నట్లు తెలిపారు. మాల్దీవులు సామర్ధ్యాల పెంపునకు, నిర్మాణానికి మద్దతునివ్వడానికి భారత్ కట్టుబడి వుందని మోదీ చెప్పారు. “మౌలిక వసతులు, సాంకేతికత, వాతావరణ మార్పు, ఇంధనం వంటి అనేక రంగాల్లో మా దేశాలు సన్నిహితంగా పనిచేస్తున్నాయి. ఇది మన ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. రానున్న సంవత్సరాల్లో ఈ భాగస్వామ్యం మరింతగా బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్నా” అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కాగా శుక్రవారం ముయిజ్జు, మోదీ మధ్య చర్చల ఫలితంగా మాల్దీవులు ఏటా చెల్లించాల్సిన రుణ మొత్తం 51 మిలియన్ డాలర్లకు బదులుగా 29 మిలియన్ డాలర్లకు అంటే 40 శాతం తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. దీంతో ఆ దేశం ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు వీలవుతుంది. అలాగే మాల్దీవుల పార్లమెంట్ స్పీకర్ అబ్దుల్ రహీం అబ్దుల్లాను కూడా ప్రధాని కలిశారు. వారితో భారత్- మాల్దీవుల మధ్య బలమైన స్నేహబంధం, అలాగే రెండు దేశాల పార్లమెంట్ మధ్యఉన్న సన్నిహిత సబంధాల గురించి చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ను ప్రధాని మోదీ కలుసుకున్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహబంధానికి ఆయన ఎల్లప్పుడూ మద్దతుదారుగానే ఉన్నారని ప్రధాని మోదీ చెప్పారు. కాగా, భారత్, మాల్దీవులు మధ్య దౌత్య సంబంధాలకు అతీతంగా విడదీయరాని బంధం ఉందని మొహమ్మద్ ముయిజ్జు ఉద్ఘాటించారు. ఇరుదేశాల సుదీర్ఘ బంధానికి హిందూ మహా సముద్రమే సజీవ సాక్ష్యమని తెలిపారు. మాల్దీవులు పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ముయిజ్జు, భారత్ ఇస్తోన్న నిరంతర మద్దతు, స్థిరమైన స్నేహానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఏడాదితో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలకు 60 పూర్తి అవుతోన్న నేపథ్యంలో ఉమ్మడి చరిత్ర, శాశ్వత భాగస్వామ్యానికి రెండు దేశాల సంబంధాలు ప్రతిబింబంగా నిలుస్తాయని చెప్పారు. ఇరుదేశాల మధ్య శతాబ్దాల నాటి లోతైన సంబధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి విపత్తులు, సంక్షోభాల సమయంలోనైనా భారత్ తమకు అండగా నిలిచిందని ముయిజ్జు కొనియాడారు. వేగంగా స్పందించి భారత్ ఆపన్నహస్తాన్ని అందించిందని ఆయన ప్రశంసించారు.
More Stories
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము