జార్ఖండ్‌లో మావోయిస్టులు ముగ్గురు మృతి

జార్ఖండ్‌లో  మావోయిస్టులు ముగ్గురు మృతి
* ఏపీలో ఇద్దరు సీనియర్ మావోయిస్టు దంపతుల లొంగుబాటు
జార్ఖండ్‌లోని గుమ్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. శనివారం ఉదయం గుల్మా జిల్లాలోని ఘాగ్రా అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు పక్షాలకు మధ్‌య ఎదురు కాల్పులు జరిగాయి.  దీంతో భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.  వారిని సీపీఐ (మావోయిస్టు)కు చీలిక వర్గం జేజేఎంపీకి చెందిన వారిగా గుర్తించారు.
ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని ఐజీ మిచెల్‌ ఎస్‌ రాజు వెల్లడించారు.  ఈ నెల 16న కూడా జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.  బొకారో జిల్లాలోని గోనియా ప్రాంతంలో ఉన్న బిర్హోర్డెరా అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు కూబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులతోపాటు ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ చనిపోయారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు సీనియర్ మావోయిస్టు  దంపతులు లొంగిపోయారు.  మావోయిస్ట్ పార్టీలో సుమారు 34 సంవత్సరాలు పైగా పని చేసిన జోరిగె నాగరాజు @ కమలేశ్, ఆయన భార్య మేడక జ్యోతీశ్వరి @ అరుణ లొంగిపోయిన్నట్లు డిజిపి హరీష్ గుప్తా తెలిపారు.  కమలేశ్, ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్చార్జ్ పనిచచేస్తున్నారు. మావోయిస్టు పార్టీ వైఫల్యాలు, కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది,  ఈ సిద్ధాంతం ఇక చలామణిలో అవ్వదని గ్రహించి లొంగిపోయినట్లు చెప్పారు

చత్తీస్‌గఢ్ లో వీరు మావోయిస్టు లుగా కీలకంగా వ్యవహరించారు కమలేష్ పై ఆంధ్రప్రదేశ్ లో రూ. 20 లక్షలు, అరుణపై రూ. 5 లక్షల రివార్డు ఉంది.  లొంగిపోయిన దంపతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున చెక్కులను అందజేశారు.  వీరితో పాటు మరో 13మంది మావోయిస్టులు కూడా డీజీపీ ముందు లొంగిపోయారు. వీరి వద్ద నుండి పోలీసులు భారీ ఆయుధ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు.
అల్లురి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ బృందాలు ఆయుధాలు డంప్ స్వాధీనం చేసుకుంది, వీటిలో మొత్తం 18 ఆయుధాలు ఉన్నాయి.  ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచార ఆధారంగా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఆయుధ, మందు సామాగ్రితో పాటు కీలక సమాచార వ్యవస్థను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.