త‌ట‌స్థ వేదిక‌ల్లో ఆసియాక‌ప్‌లో భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌

త‌ట‌స్థ వేదిక‌ల్లో ఆసియాక‌ప్‌లో భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌
ఈ ఏడాది ఆసియా క‌ప్ టోర్నీ షెడ్యూల్ ప్ర‌క‌టించాల్సి ఉంది. భార‌త్‌, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండొచ్చ‌ని తెలుస్తున్న‌ది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఈ టోర్నమెంట్‌ను తటస్థ వేదికలో నిర్వహించడానికి అంగీకరించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకారం బీసీసీఐ సెప్టెంబ‌ర్‌లో యూఏఈ ఆసియా క‌ప్‌ను నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. 
 
ఇదిలా ఉంటే ఆసియా కప్‌కు సంబంధించి కొద్దిరోజుల్లే ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ్‌జిత్ సైకియా తెలిపారు. త‌మ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా ఏసీసీ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఆయ‌న స‌భ్యుల‌కు వివ‌రిస్తార‌ని, కొన్నిరోజుల్లో అధికారికంగా అన్ని విష‌యాలు తెలుసుకుంటార‌ని, తాను ఊహాగానాల‌ను న‌మ్మ‌న‌ని సైకియా పేర్కొన్నారు.
 
ఆసియా క‌ప్‌ను యూఏఈ నిర్వ‌హిస్తున్నందున భార‌త జ‌ట్టు పాక్‌తోను బీసీసీఐ ఆడుతుంద‌ని ఏసీసీ వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. ఆసియా క‌ప్ వేదిక‌పై చ‌ర్చించేందుకు స‌భ్య‌దేశాల‌న్నీ ఏసీసీ స‌భ్యదేశాల‌న్నీ స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశంలో పాల్గొన్నారు. 
సెప్టెంబ‌ర్‌లో ప‌క్షం రోజుల పాటు ఈ టోర్నీ జ‌రుగ‌నున్న‌ది. ఇదే నెల చివ‌రి వారం నుంచి వెస్టిండిస్‌తో భార‌త్ టెస్ట్ సిరీస్ ఆడ‌నున్న‌ది.
ఢాకాలో ఏసీసీ చైర్మ‌న్‌, పాకిస్తాన్ బోర్డు చీఫ్ మొహ్సిన్ న‌ఖ్వీ కూడా ఈ కాంటినెంట‌ల్ ఈవెంట్‌లో ఇండో-పాక్ మ్యాచ్‌పై ప్ర‌శ్నించ‌గా త్వ‌ర‌లోనే వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు. 
బీసీసీఐతో చ‌ర్చ‌లు జ‌రిపామ‌ని, కొన్ని స‌మ‌స్య‌లు త్వ‌ర‌లోనే కొన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని చెప్పారు. 25 మంది స‌భ్యుల్లో డైరెక్ట‌ర్‌గా కొంద‌రు, మ‌రికొంద‌రు వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నార‌ని న‌ఖ్వీ తెలిపారు. అయితే బీసీసీఐ ఒత్తిడి నేప‌థ్యంలో ఎజెండాలోని ప‌ది అంశాల్లో కేవ‌లం రెండింటిపై మాత్ర‌మే చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.