
జగదీప్ ధన్‌ఖడ్ ఇటీవల పలు సందర్భాల్లో అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఏడాది మార్చిలో హృదయ సంబంధిత సమస్యలతో ఎయిమ్స్ డిల్లీలో చికిత్స పొందారు. గత నెలలో ఆయన ఉత్తరాఖండ్‌లోని కుమాయున్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో వేదికపై జారిపడ్డారు. భారత పార్లమెంటరీ చరిత్రలో అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న మొదటి రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి కావడం గమనార్హం. డిసెంబర్ 2024లో ఆయనపై ప్రవేశపెట్టిన ఈ తీర్మానం తర్వాత సాంకేతిక కారణాలతో తిరస్కరించబడింది. ప్రతిపక్షం ఆయనపై తీవ్రమైన విమర్శలు చేసింది. ప్రతిపక్షాల గొంతును అణచివేస్తున్నారని విరుచుకుపడింది.
జగదీప్ ధన్‌ఖడ్ 1951 మే 18న రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లా, కితానా గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తన పాఠశాల విద్యను చిత్తోర్‌గఢ్‌లోని సైనిక్ స్కూల్ లో పూర్తి చేశారు. ఆ తర్వాత జైపూర్‌లోని రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి బీ.ఎస్సీ, ఎల్ఎల్ బీ పట్టాలను పొందారు. 1979లో సుదేశ్ ధన్‌ఖడ్ ను వివాహం చేసుకున్నారు. వీరికి కామ్నా అనే కుమార్తె ఉంది.
న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ధన్‌ఖడ్ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా సుదీర్ఘకాలం పనిచేశారు. రాజస్థాన్ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1989-1991 మధ్య జనతాదళ్ పార్టీ తరపున కిషన్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.1990-1991మధ్య కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.1993-1998 మధ్య రాజస్థాన్ నుండి కాంగ్రెస్ శాసనసభ సభ్యుడిగా (ఎమ్మెల్యేగా) ధన్‌ఖడ్ సేవలందించారు.
జగదీప్ ధన్‌ఖడ్ తన కెరీర్ లో మూడు పార్టీల్లో పనిచేశారు. జనతాదళ్ లో 1989 నుంచి 1991 వరకు పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్ లో 1991 నుంచి 2003 వరకు సేవలు అందించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో 2003లో చేరారు. అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగారు.
2019-2022 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. ఈ పదవిలో ఉన్నప్పుడు పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ- ధన్‌ఖడ్ మధ్య నిత్యం మాటల యుద్దం నడిచేది. వీరిద్దరి ఆరోపణలు, ప్రత్యారోపణలు నిత్యం వార్తల్లో నిలిచేవి. 2022 ఆగస్టు 11: భారత 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో ఆయన యూపీఏ అభ్యర్థి మార్గరెట్ ఆల్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు