సిద్దరామయ్య సతీమణి కేసులో ఈడీపై సుప్రీం ఆగ్రహం

సిద్దరామయ్య సతీమణి కేసులో ఈడీపై సుప్రీం ఆగ్రహం
 
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కేసులో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతి, రాష్ట్ర  బైరతి సుమంత్రిరేశ్‌లకు జారీ చేసిన సమన్లు కర్నాటక హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.
 
 పిటిషన్‌ను పరిశీలించిన సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించడం ఏమాత్రం ఇష్టం లేదని బెంచ్‌ స్పష్టం చేసింది. ఈడీని ఎందుకు రాజకీయ పోరాటలకు ఉపయోగిస్తున్నారంటూ ఘాటుగా ప్రశ్నించింది.  రాజకీయ యుద్ధాలను ఓటర్ల ముందు జరగనివ్వాలని సొలిటర్‌ జనరల్‌తో సీజీఐ పేర్కొన్నారు.
 
“మిస్టర్‌ రాజు దయచేసి మమ్మల్ని నోరు తెరవమని అడకండి. లేకపోతే మేం ఈడీ గురించి కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు నాకు మహారాష్ట్రలో కొంత అనుభవం ఉంది. మీరు దేశవ్యాప్తంగా ఈ హింసను కొనసాగించారు. ఓటర్ల ముందు ఈ రాజకీయ యుద్ధాలు జరగనివ్వండి. మిమ్మల్ని (ఈడీ) ఎందుకు ఉపయోగిస్తున్నారు? సింగిల్‌ జడ్జి అనుసరించిన నిర్ణయంలో ఎలాంటి లోపాలు కనిపించడం లేదు. విచిత్రమైన వాస్తవాలు, పరిస్థితుల్లో దాన్ని తోసిపుచ్చుతున్నాం” అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కాగా, ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులు అరవింద్‌ ధాతార్‌, ప్రతాప్‌ వేణుగోపాల్‌లకు ఇడి సమన్లు జారీ చేయడాన్ని సుమోటోగా సిజెఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం స్వీకరించగా,  ”వారు చేసింది కచ్చితంగా తప్పు అనే విషయం ఇడికి తెలియజేశామని, ఆ తర్వాత సమన్లు ఉపసంహరించుకున్నారు ” అని జనరల్‌ ఆర్‌.వెంకట రమణి పేర్కొన్నారు. ఈ వివరణపై సిజెఐ స్పందిస్తూ మీ అధికారులు (ఇడి) అన్ని పరిమితులను దాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.