ఐఎంఎఫ్‌ను నుంచి వైదొల‌గ‌నున్న గీతా గోపీనాథ్

ఐఎంఎఫ్‌ను నుంచి వైదొల‌గ‌నున్న గీతా గోపీనాథ్
 

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప‌నిచేస్తున్న గీతా గోపీనాథ్ త్వరలో ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. ఆగస్టులో ఐఎంఎఫ్‌ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌ పదవి నుంచి గీతా గోపినాథ్‌ దిగిపోనున్నట్లు ఐఎంఎఫ్‌ అధికారికంగా ప్రకటించింది. ఆమె స్థానంలో ఆ పదవి చేపట్టే వ్యక్తి ఎవరన్నది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా గీతా గోపీనాథ్ నిష్క్రమణను ధ్రువీకరించారు.

గీతా గోపీనాథ్ (జననం 8 డిసెంబర్ 1971) ఒక భారతీయ-అమెరికన్ ఆర్థికవేత్త, 2019లో ఆమె ఐఎంఎఫ్ చీఫ్ఎ కానమిస్ట్ నియమితులయ్యారు. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక విధానాలు రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2022లో ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలోకి ప్రమోట్ కావడంతో మరో మైలురాయిని సాధించారు.

గ్లోబల్ పాండమిక్, ఆర్థిక మాంద్యం వంటి క్లిష్టపరిస్థితుల్లో ఐఎంఎఫ్ కు మార్గదర్శకత్వం ఇచ్చారు. కరోనాతో పలు దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి.  ఉపాధిలేక అనేకులు ఆర్థిక ఇబ్బందుల గుండా పయనించారు.  చిన్నదేశాలు, పర్యాటకపై ఆధారపడ్డ దేశాలు అయితే కోలుకోలేని దెబ్బతగిలింది. అయితే ఈ పరిస్థితుల్లో గీతా తన చాకచక్యతను చాటి, ఆ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఈ సీజన్లో ఆమె తీసుకున్న నేటికి ఆదర్శప్రాయంగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. 

ప్రొఫెసర్ గా కొనసాగనున్న గీతా గోపీనాథ్ గీత గోపీనాథ్ పదవి నుంచి వైదొలగిన తర్వాత తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేరనున్నారు. ఐఎంఎఫ్ ఆమె చూపిన నైపుణ్యం, నాయకత్వం ప్రపంచ ఆర్థిక రంగంలో చిరస్మరణీయంగా నిలిచే అవకాశముందని క్రిస్టాలిన్ జార్జివా కొనియాడారు . అంతేకాదు అకడమిక్ రంగంలోనే గణనీయమైన సేవలు అందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.