ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రభవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా రాష్ట్రపతి భవన్ ఉప రాష్ట్రపతి రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖకు పంపింది. అనంతరం దీనిని హోం శాఖ నోటిఫై చేసి ఈ నిర్ణయం ఇప్పటి నుంచే అమల్లోకి వస్తుందని రాజ్యసభకు తెలిపింది.
అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 67ఏ కింద ఉపరాష్ట్రపతి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన విషయాన్ని కేంద్ర హోంశాఖ రాజ్యసభకు తెలియజేసింది. 12 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే సభను నిర్వహిస్తున్న ఘనశ్యామ్ తివారీ నోటిఫికేషన్‌పై సభ్యలకు వివరించారు. కాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం రాత్రి రాజీనామా చేశారు.
ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారి స్పందించారు. ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్‌ఖడ్‌కు అనేక అవకాశాలు లభించాయన్నారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్‌కు ఎంతో కీలకం