
దేశవ్యాప్త తమ పరిధిలోని పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో హై-రెజల్యూషన్ ఆడియోవిజువల్ సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని ఆదేశించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం పాఠశాలల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, కారిడార్లు, మెట్ల మార్గాలు, తరగతి గదులు, ల్యాబొరేటరీలు, లైబ్రరీలు, క్యాంటీన్లు, స్టోర్ రూమ్‌లు, క్రీడా స్థలాలు వంటి సామూహిక ప్రదేశాల్లో సీసీటీవీలు తప్పనిసరి. అ
యితే, టాయిలెట్లు, వాష్‌రూములను మాత్రం వీటి నుంచి మినహాయించింది. సీసీటీవీ కెమెరా వ్యవస్థలు రియల్‌టైమ్ ఆడియో విజువల్ మానిటరింగ్‌కు అనుకూలంగా ఉండాలి. వాటి రికార్డింగులను కనీసం 15 రోజులు భద్రపరచాలి. అవసరమైతే సంబంధిత అధికారులకు ఈ వీడియోలు సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు, స్కూల్ మేనేజ్మెంట్ ఈ రికార్డుల బ్యాకప్‌ను కూడా ఏర్పాటు చేయాలని సీబీఎస్ఈ పేర్కొంది.
కాగా, విద్యార్ధులపై వత్తిడిని తగ్గించేందుకు ఏటా రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. పాఠశాలల్లో చిన్నారుల భద్రత, సంరక్షణపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సిపిసిఆర్) సిఫార్సులకు అనుగుణంగా మార్గదర్శకాలను సీబీఎస్ఈ రూపొందించింది. మార్గదర్శకాల్లో మానసిక, శారీరక భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపింది.
విద్యార్థులపై జరిగే దాడులు, మానసిక ఒత్తిళ్లు విద్యావ్యవస్థలో దుష్పరిణామాలకు దారితీస్తాయని, పాఠశాల్లో జరిగే అకారణ దాడులను గుర్తించేలా జాగ్రత్త వహించాలని సీబీఎస్ఈ హితవు తెలిపింది. ఈ భద్రతా ప్రమాణాలను పాటించని పాఠశాలలు బోర్డు అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించింది. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, సందర్శకులు, ఔట్‌సోర్స్ ఉద్యోగులు భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ సూచించింది.
కాగా, ఇటీవల కాలంలో స్కూళ్లలో విద్యార్థులపై భౌతిక దాడులు, లైంగిక వేధింపుల ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల భద్రత విషయంలో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శల నేపథ్యంలో సీబీఎస్ఈ తాజగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
More Stories
బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యాం పనులకు భారత్ శ్రీకారం
చట్టవిరుద్ధమని తేలితే బిహార్‌లో ఎస్ఐఆర్ ను రద్దు చేస్తాం
హజారీబాగ్‌లో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి