
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరూ కలిసి రావాలని బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు .పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి మరిన్ని అభివృద్ధి పనులకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
56 వ డివిజన్ పాత రాజా రాజేశ్వరిపేటలోని జేపీ అపార్ట్మెంట్ డీ బ్లాక్ నుండి స్కై మెడికల్ అండ్ ఫాన్సీ షాప్ వరకు రూ 49.95 లక్షల నిధులతో 690 మీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, లైన్ నిర్మాణ పనులను , మహంకాలమ్మ టెంపుల్ జంక్షన్ నుండి రైల్వే గేటు వరకు పెవర్ బ్లాక్స్ తో రహదారి విస్తరణకు, రూ 48 .23 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
ముందుగా ఎర్ర కట్ట డౌన్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూటమి నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జేపీ అపార్ట్మెంట్ నివాసితులకు ఇచ్చిన హామీ మేరకు రోడ్లు , డ్రైనేజీల ను నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలోనే అప్రోచ్ రోడ్, వాటర్ ట్యాంక్ నిర్మాణం,పార్క్ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు .
పశ్చిమలోని మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నానని పేర్కొంటూ ఎన్నికల వరకే రాజకీయాలని, అనంతరం అందరం కలిసి సమిష్టిగా ప్రజాసేవలో భాగస్వామ్యులం కావాలని స్పష్టం చేశారు. ఎన్నికల్లో చెప్పిన ప్రతి పని చేస్తున్నామని తెలిపారు. వైసీపీ కార్పొరేటర్లు అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బుడమేరు ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పశ్చిమ ప్రజలకు ఎల్లవేళలా ఎన్డీఏ కార్యాలయం అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.
More Stories
సుంకాలతో సగం రొయ్యల ఎగుమతులు.. రూ 25,000 కోట్ల నష్టం
రాజకీయాల్లో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం
యూరియా ఎక్కువ వాడితే కాన్సర్… వాడకం తగ్గిస్తే కట్టకు రూ. 800