ఆపరేషన్ సిందూర్ కింద ఉగ్రవాదుల యజమానుల ఇళ్ళను 22 నిమిషాల్లోనే నేలమట్టం అయ్యాయని పేర్కొంటూ ఈ కొత్త రూపమైన మేడ్ ఇన్ ఇండియా సైనిక శక్తికి ప్రపంచం చాలా ఆకర్షితులైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. “ఈ రోజుల్లో, నేను ప్రపంచ ప్రజలను కలిసినప్పుడల్లా, భారతదేశం తయారు చేస్తున్న మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల పట్ల ప్రపంచ ఆకర్షణ పెరుగుతోంది” అని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఈ సమావేశం దేశానికి గర్వకారణమైన విజయోత్సవంగా ఆయన అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశం ఉగ్రవాదం, నక్సలిజం వంటి సమస్యలను ఎదుర్కొంటోందని, అయితే నేడు నక్సలిజం, మావోయిజం ప్రభావం వేగంగా తగ్గుతోందని ప్రధాని చెప్పారు. దేశ భద్రతా దళాలు ఉత్సాహంతో విజయం వైపు పయనిస్తున్నాయని, వందలాది జిల్లాలు నక్సలిజం ప్రభావం నుంచి విముక్తి పొందాయని ఆయన తెలిపారు.
గతంలో రెడ్ కారిడార్‌గా పిలిచే ప్రాంతాలు ఇప్పుడు గ్రీన్ జోన్‌లుగా మారుతున్నాయని, ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బాంబులు, తుపాకుల ముందు భారత రాజ్యాంగం విజయం సాధిస్తోందని ఆయన ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ భారత సైనిక శక్తి గురించి మాట్లాడుతూ, దేశం సైనిక రంగంలో గొప్ప పురోగతి సాధిస్తోందని తెలిపారు.
సైనిక రంగంలో పరిశోధన, తయారీ, మేక్ ఇన్ ఇండియా ఆయుధాల ఉత్పత్తి బలపడుతోందని పేర్కొంటూ ఇది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం 100 శాతం లక్ష్యాలను సాధించిందని, కేవలం 22 నిమిషాల్లోనే శుత్రువుల ఇళ్లలోకి వెళ్లి వారి స్థావరాలను నాశనం చేసిందని పేర్కొన్నారు.
సైన్స్, టెక్నాలజీ రంగంలో భారతదేశం సాధిస్తున్న విజయాల గురించి మోదీ మాట్లాడారు. ఈ రంగంలో దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందని, అంతరిక్ష రంగంలో భారత్ కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత త్రివర్ణ పతాకం ఎగిరిన సందర్భాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ క్షణం దేశ ప్రజలందరికీ గర్వకారణమని, పార్లమెంట్ లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఒకే సమయంలో ఈ విజయాన్ని కొనియాడాయని మోదీ తెలిపారు.

“ఐఎస్‌ఎస్‌లో మువ్వన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలకు గర్వ కారణం. అంతరిక్ష యాత్రలో ఇదో ప్రేరణ, స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆపరేషన్ సిందూర్‌లో మన సైనికుల సత్తా చూశాం. ఇందులో వందశాతం లక్ష్యాలు సాధించాం. కచ్చితమైన లక్ష్యంతో ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేశాం. మేడిన్ ఇండియా గొప్పతనం ఏంటో ప్రపంచం చూసింది” అని ప్రధాని మోదీ తెలిపారు.
More Stories
ఆపరేషన్ సింధూర్ తో ముక్కలైన మసూద్ కుటుంబం
బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత