
రాజకీయాలను వీడాలని నిర్ణయించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ తెలిపారు. శనివారం తన శాసన సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా పత్రం అందజేశారు. “నా హృదయం బరువెక్కింది, కానీ నేను రాజకీయాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నా. ఎమ్మెల్యే పదవికి నా రాజీనామాను స్పీకర్ ఆమోదించాలి. పార్టీకి నా శుభాకాంక్షలు. పంజాబ్ ప్రభుత్వం ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉంటుందని నేను ఆశిస్తున్నా” అని ఎక్స్‌లో ఆమె పేర్కొన్నారు.
కాగా, పంజాబ్ గాయని అయిన అన్మోల్ గగన్ మాన్ 2022లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖరార్ స్థానం నుంచి ఆప్ తరుఫున పోటీ చేసి గెలిచారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంలో మంత్రిగా అన్మోల్ కొంతకాలం పనిచేశారు. పర్యాటకం-సంస్కృతి, పెట్టుబడి ప్రమోషన్, కార్మిక, ఆతిథ్యం వంటి కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.
మరోవైపు గత ఏడాది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అన్మోల్ గగన్ మాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రముఖ పంజాబీ గాయని. సూట్, గైంట్ పర్పస్, షెర్ని వంటి పాటలతో ప్రసిద్ధి చెందారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు