
విజిలెన్స్ విభాగం చేసిన దర్యాప్తులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. ఎలిజర్, స్టాఫ్ నర్స్ రోసీ, ఫార్మసిస్ట్ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న డా. జి. అసుంత క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఆచరణల్లో పాల్గొంటున్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న ఆయల ఈవో, సంబంధిత నిబంధనలను ఉల్లంఘించిన వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.
టీటీడీ ఉద్యోగులంతా హిందూ మతాన్ని పాటించాలని, మతాచారాలకు భిన్నంగా వ్యవహరించరాదని నియమాల్లో స్పష్టంగా ఉంది. ఈ నియమాలకు విరుద్ధంగా నడిచినందున ఆ నలుగురు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది అని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ చర్యలతో మిగతా ఉద్యోగులకు హెచ్చరికగా నిలవాలని పేర్కొన్నారు. ఉద్యోగ నియమావళిలో పేర్కొన్న ప్రమాణాలకు కట్టుబడి ప్రతి ఒక్కరు ఉండాలని, లేదంటే మరింత కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు