
ఘజియాబాద్‌లో కాంవర్ యాత్ర సందర్భంగా ఓ వివాదం చెలరేగింది. కేఎఫ్‌సీ రెస్టారెంట్ వద్ద హిందూ రక్షా దళ్ సభ్యులు ఆందోళన చేశారు. ఈ పవిత్ర యాత్ర సమయంలో నాన్-వెజ్ అమ్మకాలు ఆపాలని డిమాండ్ చేశారు. మతపరమైన భావోద్వేగాలు గాయపడుతున్నాయని వారు పేర్కొన్నారు. కాంవర్ మాసం అంటే హిందువులకు ఎంతో పవిత్రం. ఈ కాలంలో శాఖాహారం మాత్రమే తీసుకోవడం సంప్రదాయం. అందుకే ఈ సమయంలో హోటళ్లలో నాన్-వెజ్ విందులు వద్దని వారు కోరారు.
రెస్టారెంట్ యాజమాన్యాలు సహకరించాలని హిందూ రక్షాదళ్ స్పష్టం చేసింది. స్థానిక అధికారులను కలిసి ఫిర్యాదు చేసినట్లు నేతలు తెలిపారు. కాంవర్ సమయంలో నాన్-వెజ్ ఆహారం విక్రయాలపై నిషేధం వేయాలని కోరారు. హోటళ్లు, రెస్టారెంట్లు అందరూ ఆదేశాలను పాటించాలని డిమాండ్ చేశారు. మతసామరస్యానికి ఇది అవసరమని తెలిపారు.శైవ భక్తుల కోసం ఇది ఓ పవిత్ర యాత్ర. శ్రావణ మాసంలో ఇది ప్రారంభమవుతుంది.
లక్షలాది మంది భక్తులు గంగా నది వద్దకు వెళ్తారు. అక్కడి నుండి పవిత్ర జలాన్ని తీసుకొని, కావడిలో మోస్తూ నడుస్తారు. ఆ నీటిని సమీప శివాలయాలకు తీసుకెళ్లి అభిషేకం చేస్తారు. ఈ యాత్ర ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో నిర్వహించబడుతుంది. కాంవర్ యాత్రలో పాల్గొనే భక్తులు శాఖాహారం మాత్రమే తీసుకుంటారు. అందుకే అక్కడి భోజన కేంద్రాలు కూడా అదే నిబంధనలకు లోబడాలని రక్షాదళ్ విజ్ఞప్తి చేసింది.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ