గూగుల్, మెటాలకు ఈడీ నోటీసులు

గూగుల్, మెటాలకు ఈడీ నోటీసులు
 ఆన్ లైన్ బెట్టింగ్ ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎంతోమంది ఈ వ్యసనాల బారినపడి, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరెంతోమంది అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుకున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లపై కేంద్రం కఠిన చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చర్యలకు ముమ్మరం చేసింది. 
 
అయినప్పటికీ,గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక, వెబ్సైట్ల లింక్లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ ఆరోపిస్తున్నది.  మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ సహా పలు కుంభకోణాలు వెలుగు చూసాయి.
అంతేకాదు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్కు చెందిన 29 మంది సినీనటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ  కేసు నమెదు చేసింది.  బెట్టింగ్ యాప్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రత్యేకంగా యువత ఈ ఊబిలో పడకుండా జాగ్రత్త పడాలి. అత్యాశకుపోతే ప్రాణాలే బలైపోతాయి. ప్రత్యేకంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలి. కళాశాల విద్యార్థులు స్నేహితుల ఒత్తిడితో ఇలాంటి తప్పుడు మార్గాల్లో పయనిస్తుంటారు.