కాంగ్రెస్, ఆర్జేడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఈ రెండు పార్టీలు పేదలు, బలహీన వర్గాల పేరిట రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్‌లో పర్యటించిన ప్రధాని మోదీ రూ,7,200 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, పలు రైలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తూ పేదల నుంచి భూములు తీసుకున్నా ఇప్పటికీ వారికీ ఉద్యోగాలు ఇవ్వాలనే విషయాన్ని పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
యూపీఏ పాలనలో బిహార్‌పై ప్రతీకార రాజకీయాలు చేశారని విమర్శించారు. మోతీహరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ. ఎన్నికల నేపథ్యంలో ‘బనాయేంగే నయా బిహార్, ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్’ అనే కొత్త నినాదాన్ని ఇచ్చి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాబోయే రోజుల్లా పశ్చిమ భారతదేశంలో మోతిహారి పేరు మారుమోగుతుందని, గురుగ్రామ్ తరహాలోనే గయలోనూ అవకాశాల కల్పన జరుగుతుందని చెప్పారు.
పుణె తరహాలో పాట్నాలోనూ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని ప్రధాని చెప్పారు. సూరత్ లాగానే సంథాల్ పరగణ కూడా అభివృద్ధి జరుగుతుందన్నారు. జైపూర్ తరహాలో జల్‌పాయ్‌గురిలో టూరిజం అభివృద్ధి జరుగుతుందని, బెంగళూరులా బీర్‌భూమ్ ప్రగతి సాధిస్తుందని భరోసా ఇచ్చారు.
“కేంద్రంలో కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన యూపీఏ ప్రభుత్వం ఉన్న 10ఏళ్ల కాలంలో బిహార్‌కు కేవలం రూ.2లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడి నీతీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రతీకారం తీసుకున్నారు. అదే 2014లో నాకు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. కానీ నేను అధికారంలోకి వచ్చాకా ఈ ప్రతీకార రాజకీయాలకు ముగింపు పలికాను” అని ప్రధాని చెప్పుకొచ్చారు.
“గత 10ఏళ్ల ఎన్డీఏ పాలనలో బిహార్ అభివృద్ధికి అనేక నిధులు కేటాయించాను. అంతకుముందు ఎన్నడూ లేని విధంగా బిహార్ అభివృద్ధి చెందింది. బిహార్ అభివృద్ధి చెందింతే దేశం కూడా ప్రగతి పథంలో నడుస్తుంది. అయితే, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించినప్పుడే బిహార్ అభివృద్ధి చెందుతుంది” అని స్పష్టం చేశారు.
ప్రపంచం వేగంగా 21వ శాతాబ్దంలోకి దూసుకు వెళ్తోందని, ఒకప్పుడు అధికారం పాశ్చాత్య దేశాల చేతుల్లోనే ఉండేదని, ప్రస్తుతం తూర్పు దేశాల ఆధిపత్యం, పార్టిషిపేషన్ పెరిగిందని చెప్పారు. తూర్పు దేశాలు వేగవంతమైన అభివృద్ధిని అందిపుచ్చుకున్నాయని తెలిపారు. గ్లోబల్ డవలప్‌మెంట్‌లో తూర్పు దేశాలు ఏవిధంగా అడ్వాన్స్ అవుతున్నాయో, ఇండియాలోనూ తూర్పు రాష్ట్రాల శకం నడుస్తోందని చెప్పారు.
ఇప్పటి తరానికి రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో బిహార్ ఎంత వెనుకబడిందనే విషయాలు తెలియాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. పేదలకు సంబంధించిన ధనం వారికి చేరడం అసాధ్యంగా మారిందని గుర్తు చేశారు. ఆనాటి పాలనలో పేదల నుంచి నిధులను ఎలా దోచుకోవాలనే ఆలోచన ఉండేదని ఆరోపించారు.
“21 శతాబ్దంలో ప్రపంచ వాయువేగంతో ముందుకు దూసుకెళ్తుంది. ఒకప్పుడు పశ్చిమ దేశాల చేతుల్లోనే అధికారం ఉండేది. కానీ ఇప్పుడు తూర్పు దేశాలు సైతం తమ బలాన్ని చూపిస్తున్నాయి. తూర్పున ఉన్న దేశాలు అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి. అలాగే మనం దేశంలో ఉన్న తూర్పు రాష్ట్రాలు కూడా ప్రగతి పథంలో నడవాలి. తూర్పు భారతం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా బిహార్‌లో మార్పు రావాలి. అందుకు కావాల్సిన పనులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ముమ్మరంగా చేస్తున్నాయి” అని ప్రధాని చెప్పారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు