
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వద్దకు మూడు రోజుల క్రితమే చేరింది. అయితే ఇప్పటికీ గవర్నర్ ఆర్డినెన్స్‌పై తన నిర్ణయం ప్రకటించకపోవడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇది ఒక ప్రధాన విషయంగా మారడంతో గవర్నర్ ఆర్డినెన్స్‌లోని అంశాలపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్స్‌పై సంతకం చేస్తారో విషయమై ఇంకా స్పష్టత లేదు. ఈ అంశంపై ఆయన న్యాయ నిపుణులతో చర్చించి అన్ని కోణాలు పరిశీలిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలిస్తే, రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు మార్గదర్శకాలు కూడా పంపించనున్నారు.
ఆర్డినెన్స్‌కు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అలర్ట్ చేసింది. స్థానిక సంస్థలలో బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీనిపై గవర్నర్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి. నిర్ణయం ఎలా వచ్చినా, రాష్ట్రంలో రాజకీయ వేడి మరోసారి పెరిగే అవకాశముంది.
గత అసెంబ్లీ సమావేశాల్లో రా ష్ట్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును గవర్నర్ వర్మ కేంద్రానికి పంపించగా, ప్ర స్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర అసెంబ్లీ నుంచి వచ్చిన బిలును కేంద్రానికి పంపించినప్పుడు, మళ్లీ అదే అంశానికి సంబంధించి మంత్రివర్గం ఆమోదించి పంపించిన ఆర్డినెన్స్ ముసాయిదాకు ఆమోద ముద్ర వేసే విషయంలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్ర మంత్రివర్గం పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాకు గవర్నర్ ఆమోదం తెలిపితే అది ఆర్డినెన్స్‌గా మారుతుంది. ఇదే సమయంలో రాష్ట్రపతి వద్ద కూడా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టపరమైన సమస్యలు తలెత్తవా? అనే పలు అనుమానాలతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ నిపుణుల సలహా కోరినట్లు సమాచారం.ఆర్డినెన్స్ ముసాయిదాకు గవర్నర్ ఆమోద ముద్ర లభించిన తర్వాత ఆ ఆర్డినెన్స్‌కు ఆరు నెలల్లోగా ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం కోసం బిల్లు రూపేణా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ ప్రభుత్వం ఏదైనా కారణంతో ఆర్ఢినెన్స్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోతే ఆ ఆర్డినెన్స్ ఆరు నెలల సమయం ముగియగానే ‘చెల్లుబాటు’ కాకుండా పోతుంది.
అందుకే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వూహాత్మకంగా అడుగులు వేసి ఈ ఆర్డినెన్స్‌ను తీసుకుని వచ్చారు. ఆర్డినెన్స్‌కు ఉండే ఆరు నెలల గడువు ముగిసేలోగా స్థానిక సంస్థల ఎన్నికలను ముగించేయవచ్చని ఆయన భావిస్తున్నారు.గడువులోగా ఎన్నికలను పూర్తి చేస్తే ఆ తర్వాత ఎవరూ ఏమీ చేయలేరని ధీమాతో ఉన్నారు.
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?
ఏఐతో డీప్‌ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా